ఐదేళ్లలో 18 ఫ్లాప్ లు మూట కట్టుకున్న హీరోయిన్.. ఇంత డిజాస్టర్ కెరియర్ గ్రాఫ్ ఎవరిదంటే.?

Ads

కన్నడ సినిమాతో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులోకి కెరటం మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసిన రకుల్ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తరువాత వరుస తెలుగు ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఉన్నట్టుండి వరుస ఫ్లాప్ లతో సౌత్ ఇండియా నుంచి కనుమరుగైపోయింది.

హిందీలోకి వెళ్లి అదృష్టం పరీక్షించుకుందామానుకున్నా అక్కడ కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. గత ఐదు సంవత్సరాలలో దారుణమైన ఫ్లాప్ లను మూటగట్టుకుంది. 2018 వ సంవత్సరంలో ఐయ్యారీ సినిమాలో నటించగా అది విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత దేవ్ సినిమాలో నటించిన అదికూడా ఫ్లాప్ ఖాతాలో చేరింది దేదే ప్యార్ దే సినిమా మాత్రం కొంత ఊరట ఇచ్చినప్పటికీ..

Ads

2019లో సూర్య తో ఎన్ జి కే, నాగార్జునతో మన్మధుడు 2 సినిమాలు తీసినప్పటికీ అవి కూడా దారుణమైన పరాజయాన్ని అందుకున్నాయి. తర్వాత హిందీలో మార్జవాన్ కూడా హిందీలో బిగ్గెస్ట్ ఫ్లాప్. 2020 సంవత్సరం కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు ఆమె నటించిన మొత్తం చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇక 2021 సంవత్సరంలో షిమ్లా మిర్చి చిత్రంలో నటించింది. ఇక ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు సినిమా చెక్ కూడా ఆమెకి నిరాశనే మిగిలింది.

ఆ తరువాత సర్దార్ గా గ్రాండ్ సన్ కూడా అట్టర్ ఫ్లాప్.ఆపై మెగా మేనల్లుడు తీసిన కొండపొలం సినిమా కూడా ఆమె కెరియర్ ని ప్రశ్నార్ధకంగా మార్చేసింది. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన ఎటాక్ రన్వే 24 కట్ పుత్లీ, థాంక్ గాడ్ ఇలా ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఆమెకి పరజయాన్ని మిగిల్చాయి. ఇక కెరియర్ ముగిసిపోయింది అని భావించిందో ఏమో ఈ భామ గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడు జాకీ భగ్నానీ ని ఫిబ్రవరి 22వ తేదీన గోవాలో వివాహం చేసుకోవడానికి డిసైడ్ అయినట్లు సమాచారం.

Previous articleకొత్తగా పెళ్ళైన భార్యా భర్తతో “సత్యనారాయణ వ్రతం” ఎందుకు చేయిస్తారు…?
Next article82 ఏళ్ల వయసులో జిమ్‏లో సుమ తల్లి వర్కౌట్స్… యాంకర్ సుమ రియాక్షన్ ఇదే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.