Ads
ప్రస్తుతం హడావిడి జీవనశైలి అలాగే, అనారోగ్యకరమైన అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి గుండె దడ. ఈ గుండె దడ అనేది పెద్ద చిన్న సంబంధం లేకుండా ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం.
గుండె దడ అనేది రెండు రకాలు ఒకటి గుండె దడ దడ లాడుతున్నట్టు మనం భావించడం రెండు నిజంగానే గుండెచప్పుడులో తేడా రావడం.
ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది. మామూలుగా మన మీద ఉన్న విషయం గురించి ఎక్కువ తీవ్రంగా ఆలోచించినా.. లేక అనవసరమైన స్ట్రెస్ తీసుకున్న కొన్ని సందర్భాలలో మనకు గుండె వేగం పెరిగిన అనుభూతి కలుగుతుంది. ఇది కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గే సమస్య. అయితే కొంతమందికి మాత్రం తరచుగా ఇలా అనిపిస్తూ ఉంటుంది అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
Ads
తరచూ ఇలా గుండె వేగం పెరిగినట్లు అనిపించేవారు.. ఎప్పుడైనా గుండెదడగా ఉన్నప్పుడు దగ్గరలోని హాస్పిటల్లో ఈసీజీ తీయించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మనకు వస్తున్న గుండె దడ మామూలుగా లేక నిజంగానే గుండెల్లో ఏదన్న సమస్య ఉంటే ఇలా వస్తుందా అనే విషయంపై స్పష్టత వస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఎంతో సులువు అవుతుంది.
చిన్న సమస్య కదా విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అని ఇటువంటి వాటిని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అసలు గుండె దడ కలగడానికి వెనక కారణమేమిటి అనేదానిపై స్పష్టత వస్తుంది. మీ గుండె దడ యాంగ్సైటి వల్ల కలుగుతుందా ..లేక స్ట్రెస్ వల్ల కలుగుతుందా.. గుండెలో ఏదైనా సమస్య ఉండడం వల్ల ఇలా జరుగుతుందా అనే విషయం తెలుసుకోవడంలో ఈసీజీ సహాయపడుతుంది