Ads
క్రికెట్ అభిమానుల కన్నుల పండుగగా ఆసియా కప్ 2023 ఫైనల్ లో టీం ఇండియా ఆతిధ్య శ్రీలంక జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. నిజానికి ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలుస్తుందో లేదో అని తెగ ఆరాటపడుతున్న క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటికీ కోలుకోలేని విధంగా శ్రీలంక జట్టును భారత్ చావు దెబ్బ కొట్టింది.. అంటూ పలు రకాల మీమ్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు అభిమానులు.
ఇప్పటివరకు జరగనున్న వండే ప్రపంచ కప్ మ్యాచ్లో టీం ఇండియా ఆట తీరుపై సందేహాలు వ్యక్తీకరిస్తున్న విమర్శకులను ముగించే విధంగా ఇండియన్ ఆటగాళ్లు తమ ప్రతిభ చూపించారు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలర్ల దాటికి లంక బాటర్లు 50 పరుగులకే కుప్పకూలారు. 50 ఓవర్ల మ్యాచును ఇండియన్ బౌలర్ల దాటికి 16 ఓవర్ కే శ్రీలంక చేతులెత్తేసింది. వన్డేలలో శ్రీలంక ఇంత అత్యల్ప స్కోర్ చేయడం ఇది రెండవసారి.
Ads
నిర్ణీత 51 పరుగుల లక్ష్యంతో బదిలోకి దిగిన ఇండియన్ జట్టు 6.1 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసి కప్పు కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. హార్దిక్ మరొక మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిన్నాభిన్నం చేశారు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జై షా ఆసియా కప్ ను అందించారు. ఆ తర్వాత ఆ ఆసియా కప్ ను తిలక్ వర్మకు అందించారు. ఆ తర్వాత తిలక్ వర్మ నుండి ఆసియా కప్ మరొక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళింది. అతను టీం ఇండియా ప్లేయర్ కాదు కదా.? మరి అతను ఎవరా అంటూ క్రికెట్ ఫాన్స్ తెగ వెతికేస్తున్నారు అంట.
ఇంతకీ అతను ఎవరు అంటే…టీమిండియా బ్యాటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్లకు స్లింగర్ నుంచి బంతులు రిలీజ్ చేసే రఘు రాఘవేంద్ర. నిజానికి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బౌలర్ల కంటే మన బ్యాటర్లు ఇతడిని ఎక్కువసార్లు ఎదుర్కొంటారు. బ్యాట్స్మన్ స్టైల్ కి తగ్గట్టు బంతులను రిలీజ్ చేస్తూ ఉంటాడు అంట రఘు. బ్యాట్స్మన్ ఆటను బట్టి తగిన సూచనలు చేస్తూ ఉంటాడు రఘు రాఘవేంద్ర. మరి అతనికి కప్ అందించి టీం ఇండియా కృతజ్ఞత తెలుపుకుంది.