OTT లో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా చూసారా.? మొదటి రెండు పార్టులు హిట్టే..మరి పార్ట్ 3 లో ఏముంది.?

Ads

తమిళ్ లోనే కాక తెలుగులో కూడా మాంచి సంచలనం సృష్టించిన చిత్రం పిజ్జా.విజయ్ సేతుపతికి హీరోగా గుర్తింపు తెచ్చిన ఈ మూవీ ను కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కు త్రిక్వెల్ గా వచ్చింది “పిజ్జా 3: ది మమ్మీ”. తమిళంలో జూలై 28న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ హర్రర్ చిత్రం తెలుగు డబ్బింగ్‍తో ఆగస్టు 18న విడుదలైంది.

అయితే, టాక్ బాగానే ఉన్నా ‘పిజ్జా 3: ది మమ్మీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో రిలీజ్ అయ్యింది. ఈ హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.ఇంతకీ మూవీ ఎలా ఉందో ఒక లుక్ వేద్దామా…..

Ads

అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు కాంబో లో తెరకెక్కిన ఈ మూవీ కి మోహన్ గోవింద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ లో ఒక ఫేమస్ రెస్టారెంట్ కు ఓనర్ నలన్ (అశ్విన్ కకుమాను) , కయల్ (పవిత్ర) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కయల్ ఒక యాప్ డెవలపర్ గా వర్క్ చేస్తుంటుంది.కయల్ అన్నయ్య ప్రేమ (గౌరవ్ నారాయణన్) ఒక పోలీస్ ఆఫీసర్. అయితే పెళ్లి గురించి కయల్ అన్నయ్య ప్రేమ్ తో మాట్లాడటానికి వెళ్ళినపుడు,అతను నలన్ అవమానిస్తాడు.

ఈ నేపథ్యంలో నలన్ రెస్టారెంట్‌లో అనుకోకుండా కొన్ని వింత సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతుంది. నలన్ కు తెలిసిన వాళ్ళు వరసగా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంటారు. వీటన్నిటికీ కారణం ఒక చిన్న ఈజిప్ట్ మమ్మీ బొమ్మ. ఈ ఈజిప్ట్ మమ్మీ బొమ్మకు వరుస మరణాలకు సంబంధం ఏంటి? అసలు ఆ బొమ్మలో ఎవరి ఆత్మ ఉంది? లాస్ట్ కు ఏమీ జరిగింది? అనేది మిగిలిన స్టోరీ. ఇది ఒక రొటీన్ హారర్ రివెంజ్ మూవీ. ఇలాంటి చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి కాబట్టి..తెలుగు ప్రేక్షకులకు పెద్ద హార్రర్ అనిపించదు.

Previous article“డబల్ ఇస్మార్ట్” లో రామ్ కి జోడిగా ఆ హీరో కూతురు…ఎంట్రీ మాములుగా లేదుగా.?
Next articleటీం ఇండియా ప్లేయర్ కాదు, కోచ్ కాదు..మరి ఎవరు అతను.? ఆసియా కప్ అతని చేతుల్లో ఎందుకు పెట్టారు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.