Ads
హాయ్ ఫ్రెండ్స్…నా పేరు దివ్య…నా వయసు 28ఏళ్లు . అందరి ఆడపిల్లల పెళ్లి పట్ల నాకు ఎన్నో కలలు, అంచనాలు ఉండేవి. పెళ్లి అయిన తర్వాత నా జీవిత భాగస్వామితో ఎలా గడపాలి అని ఎన్నో ఊహలు పెంచుకున్నాను.
అయితే పెళ్లయి ఆరు నెలలు గడవకముందే వాస్తవం నా ముఖాన పక్కున వెక్కిరింతగా నవ్వుతోంది. ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఇద్దరిని జంటగా మార్చే వివాహం. ఈరోజు నన్ను ఒంటరితనానికి గురి చేస్తుంది. ఇద్దరం వర్కింగ్ కావడంతో రోజులో కనీసం ఒక నాలుగు గంటల సమయం కూడా కలిసి గడపలేని పరిస్థితుల్లో… ఈరోజు మా బంధం నా మనసుకే బరువుగా మారుతుంది.
మా ఇద్దరిదీ పెద్దల కుదిర్చిన వివాహం. పెళ్లికి ముందే నా భర్తతో నాకు సంవత్సరం పైనే పరిచయం ఉంది…ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి, ఒకరినొకరు ఇష్టపడి.. పెద్దల ఆశీస్సులతో మొదలైన మా పెళ్లి పుస్తకం…. పెళ్లి అనే పదం దగ్గరే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒంటరితనం ఇప్పుడు నా చుట్టూ అలుముకుంటున్న భావన కలుగుతోంది. మా ఆయన ఉద్యోగం చేసే ఆఫీస్ మా ఇంటికి చాలా దూరం.. కాబట్టి ఎప్పుడూ ఎర్లీగా వెళ్లడం ,లేటుగా రావడం కామన్ అయిపోయింది.దీంతో మా ఇద్దరి మధ్య ఎప్పుడూ లేనిది రోజు కొట్లాటలే.
పోనీ వీకెండ్స్ లో అయినా నా కోసం టైం కేటాయిస్తాడా అంటే అది లేదు.. ఎప్పుడు చూసినా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సోషల్ గేథరింగ్స్అని ఫుల్ బిజీగా ఉంటాడు. ఈ విషయం నాకు పెళ్లికి ముందే తెలిసినప్పటికీ.. ఇబ్బంది కాదు అనుకున్నానే కానీ…ఇప్పుడు తెలుస్తోంది సర్దుకోవడం ఎంత కష్టమో. అలాగని నాకోసం తనకు ఇష్టమైన పనులు వదులుకోమని నేను అనడం లేదు. నాకు కావాల్సింది ఒకటే…. నా భర్తతో కాస్త సమయం. అప్పుడప్పుడు రోజుకు 24 గంటల బదులు కాస్త ఎక్కువ టైం ఉంటే బాగుండేమో అన్న ఆలోచన కూడా కలుగుతుంది.
Ads
నాకు మేమున్న అపార్ట్మెంట్లో ఎవరు తెలియదు. సో ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. ఒంటరితనం కారణంగా మా ఇద్దరి మధ్య వస్తున్న గొడవల గురించి నా భర్తకు తెలుసు. అయినా అతను తన ధోరణిలో తాను ఉన్నదూ. నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు?… ఇది ఒక 28 ఏళ్ల కొత్త పెళ్లికూతురు మానసికవ్యధ.
ఇందులో పెద్ద సమస్య ఏముంది.. చాలామంది ఇలాగే కదా బతుకుతున్నారు. అయినా ఎప్పుడూ నీ పక్కనే కూర్చుంటే…సంపాదన ఎవరు సంపాదిస్తారు? ఇది ఈ సమస్య వింటే చాలామంది చెప్పే సమాధానాలు. కానీ ఒకసారి ఆగి ఆలోచించండి…ఒంటరితనం ఎంత భయంకరమైనదో అర్థమవుతుంది.
ఇక్కడ సమస్య సమయం లేకపోవడం కాదు.. ఉన్న సమయాన్ని ఇద్దరు కలిసి ఎలా గడపాలో ఇద్దరిలో ఎవరికీ స్పష్టత లేకపోవడం. భర్త ఇష్టాలకు విలువ ఇవ్వాలి కానీ…తమ ఇష్టాలు భర్తకు అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ దివ్య భర్తకు…చాలా ఇష్టమైనటువంటి సోషల్ లైఫ్ లో ఆమె కూడా ఒక భాగస్వామి కావాలి. తన ఇష్టాలకి భార్య గౌరవం ఇచ్చినప్పుడే.. ఆమె ఇష్టాలను భర్త గుర్తించగలుగుతాడు.
ఇక లైఫ్ మొత్తం..భర్త ఒక్కడే అంటే.. అది కరెక్ట్ కాదు. ఇండివిజువల్ గా ఆడవారు చేయదగిన పనులు అన్ని చేసుకోవడం నేర్చుకోవాలి. తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవడంతోపాటు.. ఇరుగు పొరుగు వారితో బాగా కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఇలా బోర్ అనిపించదు. మీరు బిజీగా ఉంటే మీ భర్త కూడా ఎక్కడ భార్య దూరం అయిపోతుందో అన్న భయంతో ఆటోమాటిక్ గా మీ వెనకే తిరుగుతాడు.