కార్తీకదీపం మోనిత “శోభా శెట్టి”… “రష్మిక” తో కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

Ads

కార్తీకదీపం సీరియల్, అందులో నటించిన వాళ్లందరికీ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అసలు ఒక్క సీరియల్ ఇంత హిట్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ సీరియల్ అయిపోయింది అంటే చాలా కాలం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. వంటలక్క, డాక్టర్ బాబు అంటూ హీరో, హీరోయిన్స్ ని ఆప్యాయంగా ప్రేక్షకులు పలకరించేవాళ్ళు. కేవలం హీరో, హీరోయిన్స్ మాత్రమే కాదు. ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు, హీరో తల్లిగా నటించిన సౌందర్య, ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన మోనితకి కూడా ఈ సీరియల్ చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

movie in which shobha shetty acted with rashmika mandanna

ఈ సీరియల్ ద్వారా మోనిత అలియాస్ శోభా శెట్టి చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. స్టైలిష్ విలన్ అనిపించుకున్నారు. మోనిత స్టైల్ ఫాలో అయ్యే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. సీరియల్ అయిపోయిన తర్వాత శోభా శెట్టి బిగ్ బాస్ కి వెళ్లారు. అందులో కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నారు. టాస్క్ లు కూడా చాలా బాగా ఆడేవారు. ఫైనల్స్ వరకు వెళ్లి శోభా శెట్టి విన్నర్ అవుతారు అని చాలా మంది ఆశించారు. కానీ శోభా విన్నర్ అవ్వలేకపోయారు. అయితే, శోభా శెట్టి కార్తీకదీపం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సీరియల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. కానీ శోభా శెట్టి ఒక సినిమాలో కూడా నటించారు.

Ads

అది కూడా రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమాలో శోభా శెట్టి ఒక చిన్న పాత్ర పోషించారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన అంజనీపుత్ర సినిమాలో శోభా శెట్టి ఒక చిన్న పాత్రలో నటించారు. తమిళ్ లో విశాల్ హీరోగా నటించిన పూజ సినిమాకి రీమేక్ ఇది. ఇందులో ఒక సీన్ లో రష్మికతో శోభా శెట్టి మాట్లాడుతూ ఉంటారు. అప్పటికి శోభా శెట్టికి ఇంత పాపులారిటీ రాలేదు. ఇదే సినిమాలో హీరో మరదలు పాత్రలో గోరింటాకు సీరియల్ హీరోయిన్ కావ్య శ్రీ నటించారు. ఇప్పుడు ఉన్న పాపులారిటీ ఊరికే రాలేదు అని, ఎంతో కష్టపడితే, ఇలాంటి ఎన్నో పాత్రలు చేస్తే, ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వీళ్ళు పైకి వచ్చారు అని ఇప్పుడు వాళ్ళ పాత సినిమాలు చూస్తే అర్థం అవుతుంది.

Previous articleపెళ్లి అయితే అయింది కానీ… ఆ ఫీలింగ్ మాత్రం.? నా సమస్యకి పరిష్కారం చెప్పగలరా.?
Next article*“డర్టీ ఫెలో” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.