Ads
ప్రపంచ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడిన భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తడబడడంతో మొదట రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ ,రోహిత్ శర్మ…ఈ ఇద్దరు ఓపెనర్స్ కనీసం ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగారు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ …ప్రెషర్ తట్టుకొని బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోనిచ్చి ఓ చెత్త షార్ట్ ట్రై చేస్తూ డకౌట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం యువ రాజ్ అతనిపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కు పంపినప్పటికీ శ్రేయస్ విఫలమయ్యాడు. రెండు వికెట్లు వెంటనే పడ్డ తర్వాత అయినా బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోనిచ్చి చెత్త షార్ట్ ఆడి పెవీలియన్ చేరుకున్నాడు. అందుకే అతనిని నాలుగవ స్థానంలో ఆడించాలి అన్న టీం నిర్ణయం పై యువరాజ్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు.
ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఓ పోస్టు రూపంలో యువీ షేర్ చేసుకున్నాడు.”టీమ్ లో ఫోర్త్ ప్లేస్ లో వెళ్లే బ్యాట్స్మన్ ఎప్పుడు కూడా ఒత్తిడిని భరించాలి. మరి అలాంటి స్థానానికి పాకిస్తాన్ పై 100 పరుగులు చేసిన తర్వాత కూడా రాహుల్ ని ఎందుకు పంపడం లేదు నాకు అర్థం కావడం లేదు. కంగారోలు కంగారుగా కోహ్లీ క్యాచ్ వదిలారు…దానికి ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. తన క్యాచ్ మిస్ చేసిన ఏ జట్టును కింగ్ వదలనే వదలడు..”అంటూ యువరాజ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.
అయితే ఈ నేపథ్యంలో టీం లో ఫోర్త్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ కంటే కూడా కేఎల్ రాహుల్ మంచి ఆప్షన్ అని నెటిజన్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న అంత హై ప్రెషర్ మ్యాచ్ లో కూడా రాహుల్ కోహ్లీ తో కలిసి నాలుగవ వికెట్ కి 165 పరుగుల భాగస్వామ్యాన్ని చేయగలిగాడు. యువరాజ్ చెప్పిన ప్రతిపాదన బాగుంది…. మరి ఈ విషయంలో రోహిత్ ద్రవిడ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
watch video: