Ads
చాలా మంది వంట గదిలో తెలియక కొన్ని పొరపాటులని చేస్తూ ఉంటారు. ఇవి ప్రాణానికే ప్రమాదం కలిగించవచ్చు. నిజానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. కొన్ని కొన్ని పద్ధతులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కరోనా మహమారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారు. శుభ్రత విషయంలో ఒక అడుగు ముందే ఉంటున్నారు. కొన్ని అలవాట్లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి.
అటువంటి ఆహారం తీసుకోవడం వలన జబ్బులు వస్తాయి. శుభ్రం కచ్చితంగా ఉండాలి. పరిశుభ్రత లేకపోతే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. కాబట్టి కిచెన్ లో ఎటువంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
#1.రీసైకిలింగ్ బ్యాగ్స్:
వీటిని అసలు ఉపయోగించకూడదు. మార్కెట్ నుండి మీరు కూరగాయలు, సామాన్లు తెచ్చుకున్నాకా వాటిని మళ్లీ మళ్లీ వాడటం మంచిది కాదు.
#2. సామాన్లు ని క్లీన్ చేసే స్పాంజ్లు:
ఎక్కువ కాలం ఒకే స్పాంజిని వాడటం వలన బ్యాక్టీరియా వస్తుంది. మురికి అందులో ఉండిపోతే కీటకాలు ఉత్పత్తి అవుతాయి. ఇది ఆహారం పై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది చూసుకోండి.
#3. ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని పెట్టడం:
Ads
వండిన ఆహారం చల్లారిపోయిన తర్వాత దానిని ఫ్రిజ్లో పెట్టడం వలన సూక్ష్మజీవులు వ్యాప్తి చెందుతాయి కనుక కాస్త వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి.
#4. నూనెని వెంటనే క్లీన్ చేయండి:
నూనె ఎక్కడైనా ఒలికితే వెంటనే క్లీన్ చేయాలి లేకపోతే అది మొత్తం ఇల్లంతా వ్యాపిస్తుంది. జారిపోయే ప్రమాదం కూడా ఉంది.
#5. ఆహార పదార్థాలని కడగడం:
మీరు వండుకునే ముందు ఆహార పదార్థాలను కడగాలి. మాంసం వంటివి క్లీన్ చేసినప్పుడు అవి సింక్ లో పడతాయి. అవి ఇతర పాత్రలకి కూడా అవి అంటుకుంటాయి. మీరు చూడకుండా అవి అలా ఉండిపోతాయి. కాబట్టి జాగ్రత్త పడాలి.
#6. ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయడం:
ఫ్రిజ్ ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ శుభ్రంగా లేకపోతే అందులో ఉండే ఆహార పదార్థాలకు కూడా పాడవుతాయి. శుభ్రంగా ఉండవు.
#7. ఆహారం నిల్వ ఉంచడం:
ఫ్రిజ్ లో ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. పండ్లు కూరగాయలని మూడు నుండి ఏడు రోజులు ఉంచొచ్చు. పాలని రెండు నుండి ఐదు రోజులు ఉంచొచ్చు, చేపలు మాంసం మూడు రోజులు ఉంచాలి. గుడ్లు వారం వరకు ఉంచొచ్చు. బేకరీ నుండి తెచ్చుకునే కేకులు వంటివి అయిదు రోజులు వరకు ఉంచచ్చు.