“అదితి రావు హైదరీ” మొదటి భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే..?

Ads

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా, సమ్మోహనం, నాని హీరోగా నటించిన వి, మహాసముద్రం లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న నటి అదితి రావు హైదరీ. అదితి స్వతహాగా తెలుగువారు. వనపర్తి జిల్లాలో వారికి చాలా ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా, అదితి రాజుల కుటుంబానికి చెందినవారు. గతంలో బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన అదితి, గత ఆరు సంవత్సరాల నుండి తెలుగు, తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

aditi rao hydari first husband

కొన్ని సినిమాల్లో తన సొంత డబ్బింగ్ చెప్పుకున్నారు. కొన్ని సినిమాల్లో మాత్రం డబ్బింగ్ ఇప్పించారు. అదితి రావు హైదరి నటించడంతో పాటు, క్లాసికల్ డాన్సర్, అలాగే మంచి సింగర్ కూడా. ఏదైనా ఇంటర్వ్యూలలో అదితి పాడుతూ ఉంటారు. అదితి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా వరకు ఎవరికీ తెలియవు. అదితికి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. అదితి పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు సత్యదీప్ మిశ్రా.

aditi rao hydari first husband

Ads

సత్యదీప్ ఒక లాయర్, అలాగే యాక్టర్ కూడా. ఎన్నో సినిమాల్లో నటించారు. 2002లో అదితి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అదితి వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే అని సమాచారం. కానీ 2012 లో వీళ్ళిద్దరూ విడిపోయారు. అదితి తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు సత్యదీప్ మిశ్రాని కలిసారట. అదే అదితి మొదటి ప్రేమ. దాంతో అదే నిజమైన ప్రేమ అనుకున్నారట. తర్వాత కొద్ది సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు.

aditi rao hydari first husband

సత్యదీప్ నటుడు అవ్వడానికి తన లా వృత్తిని వదిలేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల, అభిప్రాయ భేదాల వల్ల వీళ్ళు విడిపోయారు. కలిసి ఉండటం కంటే, స్నేహితులుగానే వాళ్ళు ఉండడం సరైన నిర్ణయం అని అనుకున్నారు. కానీ ఇప్పటికి కూడా వెళ్ళు స్నేహితులుగానే ఉంటున్నారు. సత్యదీప్ తల్లికి అదితి కూతురితో సమానం, అదితి తల్లికి సత్యదీప్ కొడుకుతో సమానం అని అదితి చెప్పారు.

aditi rao hydari first husband

ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే అనుకుంటారు అని అన్నారు. ఈ విషయాన్ని అదితి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంక సత్యదీప్ మిశ్రా విషయానికి వస్తే, 27వ తేదీ 2023 లో డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నారు. 2022 లో వచ్చిన విక్రమ్ వేద సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఇప్పుడు పూర్తిగా నటన మీదే ఉన్నారు. ఎక్కువగా హిందీ భాషలోనే నటిస్తూ ఉంటారు. అటు సినిమాల్లో, ఇటు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Previous articleవంటిగదిలో ఈ 7 పొరపాట్లని చెయ్యద్దు.. ప్రాణానికే రిస్క్..!
Next articleఏ భార్యా కూడా ఈ 4 విషయాలని భర్తకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు..!