Ads
మీరు కొత్త వాషింగ్ మెషీన్ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? ఫ్రంట్ లోడ్ మంచిదా టాప్ లోడ్ మంచిదా అనే సందేహంలో పడ్డారా..? ఏది కొనాలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారా అయితే కచ్చితంగా మీరు ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల మధ్య తేడాని చూడాలి. అప్పుడు మీరే మంచి వాషింగ్ మెషీన్ ని కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకోగలరు.
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కి టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ కి మధ్య తేడాలు ఇవే:
Ads
#1. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ బట్టలు వెయ్యడానికి బట్టలు తీసేందుకు కంఫర్ట్ గా ఉన్నప్పటికీ ఈ మెషీన్ లో బట్టలని రఫ్ గా హ్యాండిల్ చేస్తుంది. ఓవర్ లోడ్ అయితే మరీ ఇబ్బందే. ఫ్రంట్ లోడ్ లో ఇలా ఉండదు.
#2. ఫ్రంట్ లోడ్ లో బట్టలు ఉతికే సమయంలో ఏమైనా బట్టలని మధ్య లో వేసి తీసుకోవచ్చు. కానీ టాప్ లోడ్ లో మాత్రం అవ్వదు.
#3. టాప్ లోడ్ వాటి పైన బట్టలని ఒక దాని పైనొకటి పెట్టడం అవ్వదు పక్క పక్కన ఉంచాలి. ఫ్రంట్ లోడ్ అయితే ఒక దాని పైనొకటి పెట్టడం అవుతుంది. మీరు డ్రయర్ అక్కర్లేర్డు అనుకుంటే రెండూ సేమ్ ఏ.
#4. ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటాయి ఫ్రంట్ లోడ్ మెషీన్స్ . అలానే క్లీన్ ని కూడా బాగా చేస్తాయి. ఎలెక్ట్రిసిటీ తక్కువవుతుంది. వాటర్ కూడా తక్కువే పడతాయి. కానీ ఖరీదు ఎక్కువే.
#5. ఎక్కువ వాష్ ఫీచర్స్ ఫ్రంట్ లోడ్ లో ఉంటాయి.
#6. కానీ ఫ్రంట్ లోడ్ లో ఎక్కువగా వాడే కొద్దీ డోర్ రబ్బర్ గాస్కెట్ మీద మోల్డ్ వస్తుంది. ఇదే పెద్ద కంప్లైంట్. ఎక్కువ మెయింటనెన్స్ చెయ్యాలి. కానీ ఫ్రంట్ లోడ్ లో అలా కాదు.