Ads
అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్రాస్ నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలించిన తరువాత తెలుగు ఇండస్ట్రీకి చెందినవారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో అక్కినేని నాగేశ్వరరావు 1975లో శంకుస్థాపన చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం పూర్తైన తర్వాత ఇందులో అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో వేల చిత్రాలకు సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంస్థలో వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా నాగార్జున ఈ సంస్థలో చేరిన మొదటి ఉద్యోగి గురించి చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కింగ్ నాగార్జున తమ అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి తెలియాలనే ఉద్దేశ్యంతో ‘హీరోస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్’ అనే సిరీస్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ స్టూడియోలో 47 ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగి గురించి ఒక వీడియోలో మాట్లాడారు. దీనిని చూసిన నెటిజెన్లు నాగార్జునను అభినందిస్తున్నారు. నాగార్జున మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్‌ను 1976లో జనవరి 14న ప్రారంభించాము. అన్నపూర్ణ స్టూడియోస్ లో చేరిన తొలి ఉద్యోగి రామాచారి.
47 ఏళ్లుగా ఇక్కడ చాలా నిజాయితీగా పనిచేస్తున్నారని, మా ఫ్యామిలీలో మనిషిలా మారారని అన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్ళు అయినా, ఇప్పటికే అప్పటిలానే యాక్టివ్‌గా వర్క్ చేస్తారు. తమ డబ్బులు బీరువాలో పెట్టి, ఆ తాళం రామాచారికి ఇచ్చి, సంతోషంగా ఉండవచ్చని చెప్పుకొచ్చారు. రామాచారి మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోలో జాయిన్ అయిన మొట్ట మొదటి ఉద్యోగినని, అక్కినేని కుటుంబం తనను సొంత మనిషిలా చూస్తారు.
సొంత ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశారు. అదే కాకుండా ఎలాంటి కష్టం వచ్చినా నాగార్జున గారు ఆదుకునేందుకు ముందుకు వస్తారని చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు తాము ఈ స్థాయికి రావడానికి ముఖ్యంగా కష్టపడింది ఇందులో పనిచేసే ఉద్యోగులేనని నాగార్జున అన్నారు. ఉద్యోగుల వల్లే ఇప్పుడు ఇలా ఉన్నామని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఎప్పుడూ ఉంటామని నాగార్జున వెల్లడించారు.
Ads
Also Read: ఇదెక్కడి క్రియేటివిటీ బాబు.. ప్రమోషన్స్ తోనే కామెడీ పండించేస్తున్నారుగా..?