బ్రాహ్మణుల్లో చాలా మంది ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు తినరు..? కారణం ఏమిటంటే..?

Ads

ఒక్కొక్కరి సంప్రదాయాలు ఒక్కొక్కరి ఆచారాలు ఒక్కోలా ఉంటాయి. అందరూ ఒకేలా నడుచుకోరు. కొంతమందిలో ఇది తప్పు అని అనిపిస్తూ ఉంటే కొంత మందిలో ఇది ఒప్పు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరికి తగ్గ ఆచారాల్ని ఎవరికి తగ్గ సాంప్రదాయాన్ని వాళ్లు పాటిస్తూ ఉంటారు. తరతరాల నుండి వస్తున్న అలవాట్లుని వారు కూడా అలవాటు చేసుకుంటారు.

ఇది వరకు అయితే తండ్రి, తాత అనుసరించే పద్ధతులను ఎంతో కఠినంగా పాటించేవారు. కానీ రాను రాను ఇటువంటి వాటిని పాటించడం తగ్గుతోంది.

ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. అయితే బ్రాహ్మణులు కూడా కొన్ని ఆచారాలని పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రాహ్మణులు మాంసాహారాన్ని తీసుకోకుండా ఉంటారు ఈ విషయం మనకి తెలుసు. కానీ చాలా మంది బ్రాహ్మణులు ఉల్లిపాయని వెల్లుల్లిపాయల్ని కూడా ఆహారంలో తీసుకోరు. ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? ఎందుకు బ్రాహ్మణులు ఉల్లిపాయలని, వెల్లుల్లిపాయలని తీసుకోరని… నిజానికి దీనిని ఎవరూ గుడ్డిగా అనుసరించరు.

Ads

శరీరానికి ఇలా చేయడం వలన మేలు కూడా కలుగుతుంది. అందుకే బ్రాహ్మణులు వీటిని వారి ఆహార పదార్థాలలో తీసుకోరు. బ్రాహ్మణులు మంచి ఫ్లేవర్ ని ఇస్తాయి కదా అయినా వాటిని ఎందుకు ఉపయోగించకూడదు..? ఎందుకు తినరు అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయ, వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వాసనా వస్తుంది. వీటిని తింటే నాలుక మీద వాటి వాసన ఎక్కువ సేపు ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మాట్లాడినా వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటి ఆహార పదార్ధాలను సాత్విక ఆహరం గా భావించరు. సాత్విక ఆహారం తప్ప మిగిలినవి ముట్టుకోరు. అలానే చాలా మంది బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణ, వేద పారాయణాలని వృత్తిగా ఎంచుకుంటారు. స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి. అందుకోసం తమో, రజో గుణాలు వుండే వాటిని తీసుకోరు.

Previous articleఎన్టీఆర్ గారు పెళ్లి నిశ్చయించాక…పెళ్లి చూపుల్లోనే భువనేశ్వరి గారికి చంద్రబాబు గారు ఈ 3 కండిషన్లు చెప్పేసారంట.!
Next articleఅతనికి బీరువా తాళాలు కూడా ఇచ్చేయవచ్చు అంటున్న నాగార్జున..! ఎవరా వ్యక్తి..?