Ads
ప్రస్తుతం ఉన్న రోజుల్లో 18 ఏళ్ల వయసు రాకముందే పిల్లలు ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టేస్తున్నారు. అందరూ కాదు గాని కొందరు చదువులు పక్కన పెట్టి టీనేజ్ వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. టీనేజ్ వల్ల ఉండే ఆకర్షణకు లోనై హద్దులు కూడా దాటుతున్నారు.ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో బాలికలు తమ ప్రేమించిన అబ్బాయిని ఇంటికి కూడా పిలుస్తున్నారు.
అలాంటి సమయంలో కుటుంబ సభ్యులకు దొరికిపోయి చివరికి దెబ్బలు తిన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి అయితే ఒక బాలిక మాత్రం తెలివిగా తప్పించుకుంది. తన ప్రియుడిని బుక్ చేసేసింది. అంతేకాదు తాను ఎవ్వరిని లవ్ చేయడం లేదని కుటుంబ సభ్యులను ఒప్పించడానికి తన కుటుంబ సభ్యులందరి ముందు తన ప్రియుడిని చెప్పుతో కొట్టింది.
ఇలాంటి ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలిక తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే ఆ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గమనించారు. ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో వారిని పట్టుకున్నారు.కుటుంబ సభ్యులకు దొరికిపోయిన బాలిక ఏం చేయాలో తెలియక ప్లేట్ ఫిరాయించింది. ఆ అబ్బాయితో తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఎందుకు మా ఇంటికి వచ్చావంటు అబ్బాయిని చెప్పుతో కొడుతూ రెచ్చిపోయింది.
Ads
అందరూ చూస్తుండగానే ఆ అబ్బాయిని చాలాసార్లు చెప్పుతో కొడుతూ బాగా అవమానించింది. అబ్బాయి మాత్రం ఏమి చేయలేక అలా నిలబడి పోయాడు. అమ్మాయి మాట ఇచ్చుకుని ఇంటికి వచ్చి పాపం రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోయాడు. అయితే ఆ అమ్మాయి భోజ్ పూరికి చెందిన అమ్మాయిగా నెటిజన్లు పేర్కొంటున్నారు. వారిని ఎప్పటికీ నమ్మకూడదని కామెంట్లు చేశారు ఈ అమ్మాయిని కాదు ఏ అమ్మాయిని నమ్మి ఇంటికి వెళ్ళకూడదు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అబ్బాయిలు జర జాగ్రత్త. అమ్మాయి పిలిచింది కదా అని హీరోలాగా వెళ్ళిపోతే ఇలా జీరో అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
Watch Video:
Kalesh over This boy had come to meet his girlfriend, When the girl's family members saw it, the girl started beating him in front of the whole family members
pic.twitter.com/MNHBQw4ruI— Ghar Ke Kalesh (@gharkekalesh) November 3, 2023