గర్భగుడి వెనుక భాగాన్ని ఎందుకు మ్రొక్కుతారు.. కారణం ఇదేనా..?

Ads

ఏదైనా దేవాలయానికి వెళితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన బాధలన్నీ కూడా మనం మరచిపోతూ ఉంటాము. చాలా మంది వారి కోరికలను తీర్చుకోవడానికి ఆలయానికి వెళ్లి భగవంతుడిని కొలుస్తారు. వారి మనసులో ఉన్న కోరికలని భగవంతునితో చెప్పి తీర్చమని ప్రార్థిస్తారు. ఆలయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భక్తికి ప్రశాంతతకి నిలయం ఆలయం.

ఆలయానికి వెళ్లే భక్తులు పూలు, పండ్లు, కొబ్బరికాయ వంటి పూజ సామాన్లని తీసుకువెళ్లి భగవంతుడికి అర్పిస్తారు.

అలానే అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొనడం లేదంటే ప్రదక్షిణాలు చేసి కాసేపు కూర్చోవడం ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆలయాల్లో అనుసరిస్తూ ఉంటారు. గుడిలో ఉండే ధ్వజస్తంభం మొదలు గుడి వెనక భాగమంతా తిరిగి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు గుడి వెనకాల భాగాన్ని మొక్కుతూ ఉంటారు. మీరు కూడా ఇలానే చేస్తారా..? చాలా మంది ఇలా నడుచుకుంటున్నప్పటికీ కూడా దానికి గల కారణం తెలియదు. గుడికి వెనుక భాగాన్ని మొక్కుకోవడం వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది. నిజానికి ఎవరికీ ఈ రహస్యం గురించి తెలియదు. మన పూర్వీకులు చేస్తున్నారు అని మనం కూడా గుడ్డిగా అనుసరిస్తూ ఉంటాము.

Ads

గుడిలో మూలవిరాట్ ఉండే గర్భాలయం ఎంతో ప్రశాస్తమైనది. మూలవిరాట్టు గోడలకి మధ్య కాదు వెనుక గోడకి దగ్గర ప్రతిష్టిస్తారు. అయితే రోజూ మంత్రాచ్ఛరణ చేస్తే భగవంతుని పాదపీఠం కిందున్న యంత్రం లోకి మంత్ర శక్తి వెళ్తుంది. విగ్రహానికి ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ శక్తి వలన విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు వైపులా వెళ్తాయి. మంత్ర శక్తికి దగ్గరగా ఉండేది వెనుక గోడ. అయితే భక్తులు వెనుక ఆగినప్పుడు తపశ్శక్తిని పొందడానికి అవుతుంది. ఈ కారణం గానే భక్తులు ఇలా అనుసరిస్తారు. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని నమ్ముతారు.

Previous articleసరోగసి ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న 10 మంది సినీ సెల‌బ్రెటీలు వీరే..!
Next articleమెగాస్టార్ తన కెరీర్లో కాదనుకున్న 8 సినిమాలు ఇవే