Ads
ఈనెల 5న కర్ణాటకలో మైన్స్ అండ్ జియాలజీ విభాగంలో జియాలజిస్ట్ గా పనిచేస్తున్న మహిళ హ-త్య కేసులో ఆశ్చర్యపోయే విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది.
నిందితుడు ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఆమెను చంపేశాడని భావించిన పోలీసులు అసలు విషయం బయటకు రావడంతో షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ..
బెంగళూరు రూరల్ జిల్లాలో సీనియర్ జియాలజిస్ట్ ప్రతిమ (45)ను నవంబర్ 5న ఆమె నివాసంలో హ-త్యకు గురి అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు హం-తకుడు జియాలజీ విభాగంలో డ్రైవర్ గా పనిచేసే కిరణ్ అని తేలింది. ప్రతిమకు కేటాయించిన గవర్నమెంట్ వెహికిల్ కు కిరణ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రైవర్‌గా చేరాడు. అయితే, అతను అధికారుల కీలక సమాచారాన్ని, కదలికలను బయటకు లీక్ చేస్తున్నాడని మృతురాలు ప్రతిమ అతడిని కొట్టింది.
Ads
అయినప్పటికీ, అతను పద్ధతిని సరిదిద్దుకోకుండా సమాచారాన్ని లీక్ చేయడం కొనసాగించాడు. దాంతో రీసెంట్ గా అతన్ని ప్రతిమ ఉద్యోగంలో నుండి తొలగించిందని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు మళ్లీ పనిలోకి తీసుకోనందుకు ఆమెను చం-పినట్టుగా పోలీసులకు తెలిపాడు. అయితే, ఆమె ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు తాజాగా మరో విషయం తెలిసింది. ప్రతిమను చంపేసిన తరువాత నిందితుడు బాధితురాలి ఇంటి నుండి ఒక బ్యాగును తీసుకుని బయటకు వెళ్ళినట్టుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
ఆ విషయం పై విచారణ చేయగా నిందితుడి చివరకు నిజం ఒప్పుకున్నాడు. ప్రతిమ ఇంట్లో ఉన్న 27 గ్రాముల బంగారాన్ని, ఐదు లక్షల నగదు, తీసుకెళ్లినట్టుగా వెల్లడించాడు. వాటిని తన ఫ్రెండ్ కి ఇచ్చి, మళ్ళీ వెనక్కు తీసుకుంటానని చెప్పి వచ్చినట్టు తెలుస్తోంది. ఇన్నిరోజులు ‘ఉద్యోగం నుండి తొలగించడం వల్లే నిందితుడు ప్రతిమను మ-ర్డర్ చేశాడని అనుకున్నాము. అయితే, అతడు డబ్బు, బంగారం తీసుకుని వెళ్లాడని, సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది, అని అక్కడి పోలీసులు వెల్లడించారు.
Also Read: భార్యకు బైకు నేర్పిస్తున్న భర్త.. కానీ అంతలోనే ఊహించని విధంగా అలా? చివరికి.?