Ads
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అతి తక్కువ సమయంలోనే వరుస బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు. అతి తక్కువ టైమ్ లోనే తెలుగు ప్రేక్షకుల మదిని గెలిచి అంతే త్వరగా కనుమరుగు అయ్యాడు. ఉదయ్ కిరణ్ జూన్ 26న 1980లో హైదరాబాద్ లో జన్మించారు. చిత్రం సినిమా ద్వారా 2000 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అతి కొద్ది టైమ్ లోనే స్టార్ హీరోగా మారారు. చిత్రం సినిమా తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే ఆయన చేయాల్సిన కొన్ని చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. అవి పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోగా ఉండేవాడేమో అని కొందరు అంటున్నారు. ఇక షూటింగ్ మధ్యలోనే ఆగిన ఉదయ్ కిరణ్ చిత్రాలు ఏమిటో చూద్దాం..
#1.సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఎం.రత్నం ఉదయ్ కిరణ్ తో ‘ప్రేమంటే సులువు కాదురా’ అనే సినిమాను ప్రారంభించాడు. నాలబై శాతం షూటింగ్ అయిన తరువాత ఆగిపోయింది.
#2.ఉదయ్ కిరణ్, అంకితలు హీరోహీరోయిన్స్ గా ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాను ప్రారంభించారు. కానీ ఏం జరిగిందో ఆ సినిమా క్యాన్సిల్ అయింది.#3.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘అంజన ప్రొడక్షన్స్’ బ్యానర్ లో ఉదయ్ కిరణ్ తో ఒక సినిమాని ప్లాన్ చేశారు. కానీ క్యాన్సిల్ అయింది.
Ads
#4.నందమూరి బాలకృష్ణ, అప్పటి హీరోయిన్ సౌందర్య ముఖ్య పాత్రల్లో నర్తనశాల అనే మూవీని ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ అభిమాన్యుడి పాత్ర కోసం ఎంపిక చేసారు. సౌందర్య మరణంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.#5.హిందీలో హిట్ అయిన ‘జబ్ వి మెట్’ సినిమాను ఉదయ్ కిరణ్, త్రిషలతో తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయింది.
#6.ఉదయ్ కిరణ్, సదా హీరోహీరోయిన్స్ గా సూపర్ గుడ్ ఫిలిమ్స్ మేకర్స్ ‘లవర్స్’ అనే మూవీని తీయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయింది.
#7.ఉదయ్ కిరణ్ ‘ఆదిశంకరాచార్య’ సినిమాను చేయాల్సింది. కానీ ఆ నిర్మాతకున్న ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.#8.ఎంఎస్.రాజు మనసంతా నువ్వే, నీ స్నేహం సినిమాల తరువాత ఉదయ్ కిరణ్ తో ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది.#9.దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఉదయ్ కిరణ్ తో ఒక మూవీని చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది.#10.డైరెక్టర్ తేజ కష్టకాలంలో ఉదయ్ కిరణ్ ఉండడంతో ఒక మూవీ చేయాలని, అదికూడా ఆయనే నిర్మించాలి అనుకున్నారంట. కానీ అది పట్టాలు ఎక్కలేదు.
Also Read: హీరో ఉదయ్ కిరణ్ రాసిన చివరి లేఖలో ఏముందో తెలుసా?