‘పుష్ప సీక్వెల్ తో పాటు వచ్చే ఏడాది రాబోతున్న మరిన్ని సీక్వెల్స్!

Ads

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలు సీక్వెల్స్ తీయడానికి చాలా భయపడేవారు. ఎందుకంటే బాలీవుడ్ లో విజయం పొందిన ఈ ఫార్ములా తెలుగులో అంతగా పని చేయదని వారి నమ్మకం. దీనికి కారణం లేకపోలేదు.

Ads

ఇక గతంలో వచ్చిన ‘మని’ సినిమా సూపర్ హిట్ కాగా,‘మనీ మనీ’ నిరాశపరిచింది. సుకుమార్ ‘ఆర్య’ హిట్ కాగా, ‘ఆర్య 2’అపజయం పొందింది.  అందుకే తెలుగులో సీక్వెల్స్ అంటే భయం. కానీ ఇదంతా ఒకప్పటి మాట. జక్కన్న బాహుబలి 2, బంగార్రాజు, ఎఫ్3, కార్తికేయ2 లాంటి సీక్వెల్స్ సూపర్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ సీక్వెల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఏడాది 2023లో కూడా సీక్వెల్స్ రాబోతున్నాయి. వీటిలో తెలుగు సినిమాలే కాకుండా, హిందీలో, తమిళంలో రూపొందిన టాలీవుడ్ లో హిట్ కొట్టిన మూవీస్ సీక్వెల్స్ కూడా 2023లో రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం రండి..
#1.పుష్ప 2(పుష్ప ది రూల్ ) :
సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో  వచ్చిన ‘పుష్ప’ సినిమా సక్సెస్ అయ్యింది. దీంతో ‘పుష్ప 2’ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ 2023 లో విడుదల కానుంది.#2.బింబిసార 2 :
మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ గా అయ్యింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బింబిసార 2’ 2023 లోనే విడుదల అవుతుందని టాక్.#3.ఎఫ్ 4 :
అనిల్ రావిపూడి  ఎఫ్ 3 సినిమా  తర్వాత ‘ఎఫ్ 4’ కూడా వస్తుంది అని చెప్పారు. ఈ మూవీ 2023 లోనే  విడుదల కానుంది.
#4.డీజే టిల్లు 2 :
ఈ ఏడాది మొదట్లోనే వచ్చిన ‘డీజే టిల్లు’ హిట్ అందుకుంది. ఇపుడు డీజే టిల్లు స్క్వేర్ అనే పేరుతో సీక్వెల్ రానుంది. ఈ మూవీ 2023 లోనే  విడుదల కానుంది.
#5.‘గూఢచారి 2’ :
2018 లో అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘గూఢచారి 2’ 2023 లో విడుదల కానుంది.
#6.రాక్షసుడు 2 :
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన  ‘రాక్షసుడు’ సక్సెస్ అయ్యింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ  మూవీ కూడా 2023 లోనే విడుదల కానుంది.
#7.బ్రహ్మాస్త్రం 2 :
రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర  తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది. అయితే హిందీలో యావరేజ్ గా నిలిచింది.  ‘పార్ట్ 2’ 2023 లో రాబోతుంది అని ప్రకటించారు.
#8.పొన్నియన్ సెల్వన్ 2 :
డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్  ‘పొన్నియన్ సెల్వన్ -1 ‘ సూపర్ హిట్ అయ్యింది. దీని సీక్వెల్ 2023 లో  విడుదల కానుంది.
#9.‘లూసిఫర్ 2’ :
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్’ తెలుగులో ప్రశంసలు అందుకుంది. ‘లూసిఫర్ 2’ 2023 లో మలయాళం, తెలుగులో ఒకేసారి విడుదల కానుంది.
#10.డిటెక్టివ్ 2 :
హీరో విశాల్ నటించిన ‘డిటెక్టివ్’ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ  సీక్వెల్ 2023 లో విడుదల కానుంది.

Also Read: నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యలేదు.. రష్మిక మందన

Previous articleరెండు పెళ్లిళ్లు చేసుకున్న సినీ నటులు ఎవరో తెలుసా?
Next articleఉదయ్ కిరణ్ ఈ 10 సినిమాలు చేసి ఉంటే నిలదొక్కుకునేవాడు!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.