CM REVANTH REDDY: “అన్నా” అని పిలవగానే ఆదుకున్నావ్…ఇంకో మెట్టు ఎక్కేసావ్ రేవంత్ అన్నా.! ఏమైందంటే.?

Ads

రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ విన్న బాగా పాపులర్ గా వినిపిస్తున్న పేరు. తెలంగాణ తన అడ్డాగా గెలుపు తమదే అనుకున్న కారును ఢీ కొట్టి ఘనవిజయం సాధించాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు. ఎలక్షన్స్ తర్వాత అస్వస్థతకు గురి అయ్యే హాస్పిటల్ లో చేరాడు కేసీఆర్.

ఈ నేపథ్యంలో అతని హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ అనుకోకుండా ఒక మహిళ కష్టాలు తీర్చాడు. యశోద ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లి .. అన్నా అని పిలిచినందుకు ఆ చెల్లి కష్టాలు తీర్చి..తన సహృదయాన్ని ఈ రకంగా ప్రజలకు చాటుకున్నాడు . అన్నా అని ఎలుగెత్తి పిలిచిన వెంటనే చుట్టూ ఉన్న సెక్యూరిటీని.. నియమ నిబంధనలను అన్నిటినీ పక్కనపెట్టి నేరుగా ఆమె వద్దకు వెళ్లి కష్టం అడిగిమరీ తెలుసుకున్నాడు.

హాస్పిటల్లో తన బిడ్డకు ట్రీట్మెంట్ ఖర్చు చాలా అవుతుందని.. అంత తాము భరించలేమని సాయం చేయమని సీఎంను ఆ మహిళ కోరింది. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలిసిందే కదా. పాపం బిడ్డకు బాగాలేక ..చేతిలో డబ్బులు లేక . ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఆమెకు అప్పుడే కేసీఆర్ ని పలకరించి బయటకు వెళ్తున్న రేవంత్ రెడ్డి కనిపించడంతో తట్టుకోలేక అడిగేసింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి కూడా తక్షణమే ఆమె సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Previous articleMahesh Babu: మహేష్ కి చెల్లిగా ఆ హీరోయిన్.. ఇదేం కాంబినేషన్ డైరెక్టర్ గారు.?
Next article“హాయ్ నాన్న”లో ముందుగా అనుకున్నది “శృతి హాసన్”ని కాదా.? రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.