Ads
రెండు వారాల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. టాలీవుడ్ 2022 కి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా తయారయ్యింది. ఒకే నేపథ్యంలో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్లకు వెళ్ళి చూసే పరిస్థితి లేదు.
Ads
మూసదోరణిలో చేసే సినిమాలు, ఎంత పెద్ద స్టార్స్ చేసిన ఫలితం ఉండదని నిరూపించింది. గత సంవత్సరం 2021 డిసెంబర్ లో విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా అడవుల నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా హిట్ గా నిలిచింది.ఇక దీంతో అడవి నేపథ్యం తెలుగు సినిపరిశ్రమకి సక్సెస్ దారి చూపించిందని మేకర్స్ అనుకున్నట్టు ఉన్నారు. ఈ సంవత్సరం అడవుల నేపథ్యంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. వీటిలో రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఉంది. ఇది మల్టీస్టారర్ సినిమా. కానీ ఈ బ్యాక్ డ్రాప్ లో తీసిన చిత్రాలు అన్నీ విజయం పొందలేదు. మరి ఈ ఏడాది ఈ అడవుల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఏమిటి అనేది చూద్దాం..
1.భీమ్లా నాయక్ :
ఈ సినిమాలో అడవి అమ్మ కాదు అమ్మోరు అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. కానీ మూవీ యావరేజ్ గా నిలిచింది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తీసిన ఈ సినిమా అడవుల నేపథ్యంలో తీశారు.2.ఆర్.ఆర్.ఆర్ :
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్,ఎన్టీఆర్ లు నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ కూడా అడవుల నేపథ్యంలో తీశారు. అయితే ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.3) ఆచార్య :
కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, రాంచరణ్ లు నటించిన ఈ సినిమా అడవుల నేపథ్యంలో ఉంటుంది. కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.4) విరాట పర్వం :
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా,సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా అడవుల నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.5) రామారావు ఆన్ డ్యూటీ :
శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా కొంతవరకు అడవుల నేపథ్యంలో ఉంటుంది.ఇది ప్లాప్ అయ్యింది.6) వాంటెడ్ పండుగాడ్ :
సునీల్, అనసూయ నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యినట్టు జనాలకు తెలియలేదు. ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఈ సినిమా అడవుల నేపథ్యంలో ఉంటుంది.7) లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ :
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. ఈ మూవీ కొంతవరకు అడవుల నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.8) కొండా :
వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా కొంత వరకు అడవుల నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా గురించి కూడా ఎవరికి తెలీదు.9) కాంతార :
ఈ కన్నడ డబ్బింగ్ మూవీ అడవుల నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది.10) ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం :
అల్లరి నరేష్ నటించిన ఈ సినిమా అడవుల నేపథ్యంలో తెరకెక్కింది. అయితే సినిమా బాగానే ఉన్నా, ప్రమోషన్స్ ఎక్కువగా చేయకపోవడంతో ప్లాప్ నిలిచింది.
Also Read: ఈ ఏడాది ఎక్కువ సెర్చింగ్ చేసిన టాప్ 10 మంది హీరోయిన్స్ లిస్ట్..