ఈ ఏడాది ఎక్కువ సెర్చింగ్ చేసిన టాప్ 10 మంది హీరోయిన్స్ లిస్ట్..

Ads

2022వ సంవత్సరం చివరికి వచ్చేసింది. మరో పదకొండు రోజుల్లో 2022 కి అందరు వీడ్కోలు పలుకుతారు. ఇక ఈ ఏడాదిలో కొంతమంది టాలీవుడ్ హీరోయిన్స్ కోసం ఎక్కువగా వెతికారు.

ఇక ఇలాంటి లిస్ట్ ప్రతి సంవత్సరం బయటకు వస్తుంది. ఎక్కువగా ఏ హీరో, ఏ హీరోయిన్స్ గురించి వెతికారనే లిస్ట్ బయటకు వస్తుంటుంది. ఇక ఇప్పుడు మనం హీరోయిన్ల లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఇక ఆ హీరోయిన్ల గురించి జనాలు ఎందుకు ఎక్కువగా వెతికారు. మరి ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఏ హీరోయిన్, లాస్ట్ ప్లేస్ లో ఏ హీరోయిన్ ఉందో చూద్దాం రండి..
1) కాజల్ అగర్వాల్ :
ఈ లిస్ట్ లో టాప్ 1 ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ఉంది. ఈ ఏడాదిలో కాజల్ గురించి ఎక్కువ సెర్చ్ లు జరిగాయి. ఆమె మూవీస్ కి గుడ్ బై చెప్పింది అనే వార్త. ‘ఆచార్య’ మూవీలో కాజల్ పాత్రని తొలగించడంతో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ ఏడాది ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బాబు కోసం సెర్చింగ్ చేసారు.
2) సమంత :
నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత సమంత పై ట్రోలింగ్ బాగా జరిగింది. ‘పుష్ప’లో  చేసిన ఐటెం సాంగ్ వల్ల  కూడా ఎక్కువగా వెతికారు.  ‘యశోద’ మూవీ రిలీజ్ కు ముందు మయోసైటీస్ తో బాధపడుతున్నట్టు తెలియడంతో సెర్చింగ్ చేసారు.
3) రష్మిక మందన :
నార్త్ లో పుష్ప, సీతా రామం సినిమాలతో పాపులర్ అయ్యింది రష్మిక. విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి  ఎక్కువగా సెర్చింగ్ లు జరిగాయి.
4) తమన్నా :
తమన్నాకు పెళ్లి అని సెర్చింగ్ చేసారు . ‘ఎఫ్3’ మూవీలో మగవాడి గెటప్ వల్ల కూడా తమన్నా గురించి ఎక్కువగా సెర్చ్ చేసారు. 

Ads

5) నయనతార :
నయనతార ఈ ఏడాది పెళ్లి విగ్నేష్ శివన్ తో జరిగింది. చెప్పులు వేసుకుని తిరుపతికి వెళ్లడం పెద్ద ఇష్యూ అయ్యింది. ఆ తరువాత సరోగసి పద్ధతిలో కవలలకు జన్మనివ్వడం, వీటి అన్నింటి వల్ల ఆమె కోసం సెర్చ్ చేసారు.
6) సాయి పల్లవి :
సాయి పల్లవి ‘విరాట పర్వం’ ప్రమోషన్లలో  చేసిన కామెంట్ల చేయడంతో, ఆమె పై భజరంగ్ దళ్ బ్యాచ్ కేసులు వేయడం,  పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి రావడం. ఇలా ఈమె గురించి సెర్చ్ చేసారు.
7) రకుల్ ప్రీత్ సింగ్ :
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి వార్తలు రావడం, ఆమె  బాలీవుడ్ మూవీ షూటింగ్ లో  ఉండగా కొంతమంది ఆమెపై దాడి చేయడం, ఈడి డ్రగ్స్ కేసులో 2 వ సారి నోటీసు పంపడంతో ఈమె గురించి సెర్చ్ చేసారు.
8) అలియా భట్ :
గంగూబాయి కతియావాడి, ఆర్.ఆర్.ఆర్, బ్రహ్మాస్త్ర’  చిత్రాలతో, పెళ్లి, ఆ తరువాత పాపకు జన్మనివ్వడం ఇలాంటి వార్తలతో కూడా ఈమె గురించి సెర్చ్ చేసారు.
9) దీపికా పదుకోనె :
దీపికా ‘ప్రాజెక్టు కె’ మూవీ షూటింగ్ లో హాస్పిటల్ జాయిన్ అవడం, ఇటీవల పఠాన్ మూవీలోని సాంగ్ ఇష్యు వల్ల ఈమె గురించి సెర్చ్ చేసారు.
10) కృతి సనన్ :
కృతి సనన్, ప్రభాస్ తో పెళ్లి అనే వార్తల వల్ల ఎక్కువ సెర్చ్ లు జరిగాయి.
Also Read:ఈ ఏడాదిలో మరణించిన 10 మంది తెలుగు సినీ ప్రముఖులు..

Previous articleసచిన్ నుండి కోహ్లి.. 2022లో టాప్ 10 ధనవంతులైన భారతీయ క్రికెటర్లు..
Next articleఈ ఏడాది విడుదల అయిన మల్టీ స్టారర్ సినిమాలు.. ఎన్ని హిట్ కొట్టాయంటే?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.