సచిన్ నుండి కోహ్లి.. 2022లో టాప్ 10 ధనవంతులైన భారతీయ క్రికెటర్లు..

Ads

మ‌న దేశంలో క్రీడలకు ఆద‌ర‌ణ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ అంటే భారతదేశంలో ఒక మతం. అంతేకాకుండా క్రీడాకారులను దేవుళ్ల‌లాగా కొలిచే అభిమానులు ఉన్న దేశం. క్రికెట్ లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

Ads

దేశంలో హాకీ, బాడ్మింటన్, టెన్నిస్, స్నూకర్, చెస్ లాంటి ఆటలకు అభిమానులు ఉన్నప్పటికి, దేశం మొత్తాన్ని ఏకం చేసే మరియు ప్రజాదరణ కలిగిన క్రీడా మాత్రం క్రికెట్. ఇక ఈ ఆట‌గాళ్ల‌ను సెల‌బ్రిటీలుగా చూస్తారు. ప్రస్తుతం సినీమా స్టార్స్ తో సమానంగా క్రికెటర్స్ డబ్బు సంపాదిస్తున్నారు. బీసీసీఐ ఇచ్చే భారీ జీతాలు, వివిధ సంస్థలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్స్, యాడ్స్ ద్వారా వచ్చే డబ్బుతో చేయడంతో వాళ్లు కూడా రోజురోజుకు ధనవంతులవుతున్నారు. క్రికెట్ ని ప్రొఫెషన్ గా ఎంచుకున్న వాళ్ళయితే మంచిగా రాణిస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు.ఇలాగే క్రికెట్ ని వృత్తిగా ఎంచుకుని ఎదిగిన టెండూల్కర్ ఒక ట్రెండ్ ను సెట్ చేస్తే దాన్ని విరాట్ కోహ్లీ వరకు ఫాలో అవుతు వస్తున్నారు. ఇక గంగూలీ,ద్రవిడ్, సెహ్వాగ్, ఆ తరువాత ధోనీ, రోహిత్ శర్మ వంటి క్రీడాకారులు క్రికెట్ లో వచ్చే సంపాదనతో రిచ్ ఇండియన్ క్రికెటర్స్ గా ఎదిగారు. ఇక 2022లో టాప్ 10 మంది అత్యంత సంపన్న క్రికెటర్ల జాబితా, వారి నికర విలువ ఎంతో చూద్దాం రండి..
#1. సచిన్ టెండూల్కర్ నికర విలువ: రూ. 1120 కోట్లు
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మట్స్ నుండి 2011లో రిటైర్ అయ్యాడు. కానీ సచిన్ బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గకుండా మార్కెట్‌లో అలాగే ఉంది. సంపాదనతో పాటు ప్రస్తుతం ప్రకటనలు,పెట్టుబడులతో చాలా సంపాదించాడు.
#2. మహేంద్ర సింగ్ ధోని నికర విలువ – రూ. 850 కోట్లు
సచిన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని అత్యంత పాపులర్ అయిన, ఎక్కువ ప్రశంసలు పొందిన ఇండియన్ క్రికెటర్. సచిన్ స్థానంలో ధోని బూస్ట్, MRF వంటి వాణిజ్య ప్రకటనలలో చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు.
#3. విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 700 కోట్లు
విరాట్ కోహ్లీ సచిన్ మరియు మహేంద్ర సింగ్ ధోనిల తర్వాత టాప్ 3 రిచెస్ట్ క్రికెటర్.
#4. సౌరవ్ గంగూలీ నికర విలువ రూ. 375 కోట్లు
క్రికెట్ అభిమానులు ప్రేమగా దాదా అని పిలుచుకునే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ 375 కోట్ల నికర విలువతో నాలుగవ స్థానంలో ఉన్నాడు.
#5. వీరేంద్ర సెహ్వాగ్ నికర విలువ – రూ. 334 కోట్లు
ఇండియాన్ క్రికెట్ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ 334 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఢిల్లీలో వీరేంద్ర సెహ్వాగ్ కి అంతర్జాతీయ పాఠశాల, క్రికెట్ అకాడమీ ఉంది.
#6. యువరాజ్ సింగ్ నికర విలువ – రూ. 260 కోట్లు
ఇండియాన్ క్రికెట్ లో ఆల్ టైమ్ గొప్ప ఆల్ రౌండర్ గా పేరు పొందిన యువరాజ్ సింగ్ 260 కోట్లతో ఆరవ స్థానంలో ఉన్నాడు.
#7. సురేష్ రైనా నికర విలువ – రూ. 185 కోట్లు
యువరాజ్ సింగ్ తరువాత ఉన్న సురేష్ రైనా మరో గొప్ప ఆల్ రౌండర్, సురేష్ రైనా నికర విలువ 185 కోట్లతో ఏడవ స్థానంలో ఉన్నాడు.
#8. రాహుల్ ద్రవిడ్ నికర విలువ – రూ. 172 కోట్లు
ది వాల్ గా ప్రసిద్ది చెందిన వెటరన్ భారత క్రికెటర్, ప్రస్తుత భారత క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నికర విలువ 172 కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు.
#9. రోహిత్ శర్మ నికర విలువ – రూ. 160 కోట్లు
రోహిత్ శర్మ ప్రస్తుత ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ 160 కోట్లతో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.
#10. గౌతమ్ గంభీర్ నికర విలువ – రూ. 150 కోట్లు
క్రికెటర్ గౌతమ్ గంభీర్ 150 కోట్ల నికర విలువతో పదవ స్థానంలో నిలిచాడు.
Also Read: ఇండియన్ టాయిలెట్ VS వెస్ట్రన్ టాయిలెట్… లాభ నష్టాలు ఇవే…!

Previous article‘ఆర్ఆర్ఆర్’ లాగే ఈ సంవత్సరం అడవుల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల లిస్ట్..!
Next articleఈ ఏడాది ఎక్కువ సెర్చింగ్ చేసిన టాప్ 10 మంది హీరోయిన్స్ లిస్ట్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.