Ads
ప్రేక్షకులకు ఉన్న ఎంటర్టైన్ మెంట్ అంటే సినిమా అనే చెప్పాలి. వరుసగా మూవీస్ రిలీజ్ అయిన చూస్తూ ఉత్సాహపరుస్తారు. ఇక అభిమాన హీరో సినిమాకోసం తెగ ఎదురు చూస్తారు.
అంతేకాకుండా తమ ఫేవరెట్ హీరోతో, ఇంకో స్టార్ హీరో కలిసి సినిమా చేస్తే ఇక ఫ్యాన్స్ ఆనందాన్ని ఆపలేము. ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూసేవి మల్టీ స్టారర్ సినిమాలు. ఈ ఏడాదిలో సందడి చేసిన మల్టీ స్టారర్ చిత్రాలు ఏమిటో చూద్దాం..1.బంగార్రాజు
ఈ ఏడాది మొదట్లోనే రిలీజ్ అయిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు అయిన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్ గా అలరించారు.
2.RRR
జక్కన్న తీసిన RRR సినిమా మల్టీ స్టారర్ గా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి పేరు వచ్చింది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
3.భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. మలయాళ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీకి రీమెక్ గా వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్, రిటైర్ ఆర్మీ ఆఫీసర్ గా రానా అలరించారు. ఫిబ్రవరి 25న రీలజ అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
4.ఆచార్య
ఈ సినిమాలో తండ్రి కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమాలో సత్యదేవ్ నటించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
Ads
5.F3
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన f2 సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా,సోనాల్ చౌహన్, మెహ్రీన్ ఫిర్జాదా, హీరోయిన్స్ గా నటించారు. ప్రత్యేక పాటలో పూజా హెగ్డే అలరించింది.
6.గాడ్ ఫాదర్
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లూసీఫర్ కు రీమెక్ గా వచ్చింది. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీలో సత్య దేవ్ విలన్ గా, మెగాస్టార్ కి బాడీగార్డ్ గా సల్మాన్ ఖాన్ అతితి పాత్రలో నటించారు. ఈ మూవీ సక్సెస్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఎక్కువగా పొందలేకపోయింది.
7.ఓరి దేవుడా
విశ్వక్ సేన్, ఆశా భట్, మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఓరి దేవుడా. ఈ మూవీలో వెంకటేష్ దేవుడి పాత్రలో ఆకట్టుకున్నారు. ఓ మై కడవులే సినిమాకి రీమెక్ గా వచ్చింది. ఈ సినిమాకి టాక్ పాజిటివ్ గానే వచ్చింది. యావరేజ్ గా నిలిచింది.
Also Read: చిరంజీవి vs బాలకృష్ణ.. సంక్రాంతిబరిలో ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ హిట్స్ ఇచ్చారో తెలుసా?