Ads
ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఒకటే టెంప్లేట్ ఫాలో అవుతున్నాయి కానీ, అంతకుముందు సీరియల్స్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చేవి. తమిళ్ డబ్బింగ్ సీరియల్స్ కి కూడా తెలుగులో చాలా మంచి ఆదరణ ఉండేది. రాధిక అలా ప్రేక్షకులకు చాలా చేరువయ్యారు.
ఇంకా చాలా మంది హీరోయిన్స్ కూడా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. కొంత మంది ఇప్పటికి కూడా వారి పాత్రల ద్వారానే గుర్తుంటారు. అలా జెమినీ టీవీలో ప్రసారం అయిన సీరియల్ అఖిల. ఏవీఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సీరియల్ లో అఖిల పాత్ర పోషించిన నటి ఇప్పటికీ చాలా మందికి గుర్తుండి ఉంటారు.
అఖిల అనే ఒక అమ్మాయి చుట్టూనే ఈ సీరియల్ నడుస్తుంది. పెళ్లయ్యాక అఖిల ఎదుర్కొనే సమస్యలు, అఖిల అత్త ఆమెని ఇబ్బంది పెట్టడం, అఖిల మామగారు అఖిలని సపోర్ట్ చేయడం, అఖిల భర్త తనని అర్థం చేసుకోకపోవడం, వీటన్నిటి మధ్యలో అఖిల ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనే అంశం చుట్టూ సీరియల్ తిరిగేది. ఈ సీరియల్ అప్పటిలో చాలా పెద్ద హిట్ అయ్యింది. జెమినీ టీవీలో మధ్యాహ్నం పూట ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఆ టైంలో కూడా చాలా మంచి రేటింగ్ సంపాదించుకుంది.
ఇప్పటికి కూడా అఖిల పాత్ర పోషించిన నటి అఖిల పేరుతోనే చాలా మందికి గుర్తుండి ఉంటారు. ఆమె అసలు పేరు మౌనిక. మౌనిక స్టేజ్ పేరు విజయ రేఖ. 1985 లో వచ్చిన ఉన్ కన్నిల్ నీర్ వళినాల్ అనే సినిమాతో మౌనిక తన కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. కార్తీ హీరోగా నటించిన కడైకుట్టి సింగం సినిమాలో కూడా మౌనిక నటించారు. ఈ సినిమాని తెలుగులో చిన్న బాబు పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.
Ads
ఇటీవల కన్నాగి సినిమాలో అమ్ము అభిరామి తల్లి పాత్రలో మౌనిక నటించారు. మౌనిక వాయిస్ ఆర్టిస్ట్ కూడా. కన్నడ నటి శృతి, ఈశ్వరి రావు, రమ్య కృష్ణన్ వంటి హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. మౌనిక ప్రముఖ దర్శకులు బాలు మహేంద్రతో సహజీవనం చేశారు. బాలు మహేంద్ర తన ఇంటర్వ్యూలలో, అలాగే తన బ్లాగ్ లో ఈ విషయాన్ని చెప్పారు. 1996 లో వారు ప్రేమించుకున్నారు. 1998 లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ 2004 లోనే వారి పెళ్లి గురించి బహిరంగంగా ప్రకటించారు.
మౌనిక బాలు మహేంద్రకి మూడవ భార్య. బాలు మహేంద్ర 2014 లో తుది శ్వాస విడిచారు. 1997 నుండి సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టారు. అలా కొన్ని తమిళ్ సీరియల్స్ తో పాటు, అఖిల, ఆలుమగలు వంటి తెలుగు సీరియల్స్ లో కూడా నటించారు. ఇప్పటికి కూడా సినిమాల్లో సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. అయినా కూడా మౌనిక ఆమె పోషించిన అఖిల పాత్రతోనే చాలా మందికి గుర్తున్నారు. ఇప్పటికి కూడా మౌనికని అఖిల పేరుతో గుర్తు పడుతున్నారు అంటే ఆమెకి ఎంత మంది అభిమానులు ఉన్నారో అనే విషయం తెలుస్తోంది.
ALSO READ : వాలెంటైన్స్ డే అంటే ప్రేమ దినోత్సవం అనుకుంటారు..! కానీ దాని వెనుక ఉన్న ఈ చీకటి కోణం గురించి తెలుసా..?