వాలెంటైన్స్ డే అంటే ప్రేమ దినోత్సవం అనుకుంటారు..! కానీ దాని వెనుక ఉన్న ఈ చీకటి కోణం గురించి తెలుసా..?

Ads

ఫిబ్రవరి 14వ తేదీ. ఇది సాధారణమైన మనుషులకి ఒక మామూలు తేదీ. కానీ ప్రేమికులకి మాత్రం ఇది చాలా ప్రత్యేకమైన రోజు. వాలెంటైన్స్ డే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజుని సెలబ్రేట్ చేసుకుంటారు. తాము ఇష్టపడే వారికి బహుమతులు, పూలు ఇస్తారు.

అందుకే వాలెంటైన్స్ డే వచ్చింది అంటే గిఫ్ట్ షాప్స్ లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వాలంటైన్స్ డే సందర్భంగా హిట్ అయిన ప్రేమ కథ సినిమాలు కూడా మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే వాలెంటైన్స్ డే అంటే అది ఒక సెలబ్రేషన్ అని మాత్రమే చాలా మందికి తెలుసు.

కానీ దీనికి మరొక కోణం కూడా ఉంది. దాని గురించి ఎవరూ మాట్లాడుకోరు. అసలు వాలెంటైన్స్ డే అంటే ప్రేమ మాత్రమే కాదు. ఇంకా చాలా జరుగుతాయి. దీనికి వయసుతో సంబంధం లేదు. టీనేజ్ లో కూడా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు. అది ఆకర్షణ మాత్రమే. కానీ వారికి ఆ వయసులో అంత మెచ్యూరిటీ ఉండక దాన్నే ప్రేమ అని అనుకుంటారు. కేవలం ఫిబ్రవరి 14వ తేదీ ఉన్న వారం, అంటే వాలెంటైన్స్ వీక్ లో మాత్రమే 10 నుండి 15 లక్షల మైనర్ అమ్మాయిలు గర్భవతి అవుతున్నారు.

other side of valantines day

Ads

అందుకే ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే నుండి 9 నెలల తర్వాత, అంటే నవంబర్ నెలలో పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. ఇందుకు కారణం టీనేజ్ వాళ్లకి దీని మీద సరైన అవగాహన లేకపోవడం. దాంతో తెలిసి తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల గర్భవతులు అవ్వడం, పిల్లలు పుట్టడం వంటివి జరుగుతున్నాయి. దాంతో ఆ టీనేజ్ అమ్మాయిలు అంత చిన్న వయసులోనే మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా వాలెంటైన్స్ వీక్ లో హోటల్స్ బుకింగ్ కూడా 35% పెరుగుతోంది.

ఇవన్నీ మాత్రమే కాకుండా అమ్మాయిలని బలవంతం చేయడం కూడా ఈ వాలెంటైన్స్ వీక్ లో చాలా ఎక్కువగా జరుగుతాయి. సాధారణంగా వాలెంటైన్స్ వీక్ అని, లేదా వాలెంటైన్స్ మంత్ అని ఎన్నో కంపెనీలు, ఎన్నో బ్రాండ్స్ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి. కానీ మరొక పక్క అవగాహన లేకుండా చేసే పనుల వల్ల ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాలెంటైన్స్ డే అంటే గ్రీటింగ్ కార్డ్స్, పూలు ఇవి మాత్రమే కాదు. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకుండా తీసుకునే నిర్ణయాలు. దాని వల్ల మానసికంగా వారు ఎదుర్కొనే సంఘటనలు కూడా.

ALSO READ : SUCCESS STORY: ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో తండ్రి వదిలేసాడు…కానీ ఆ ముగ్గురు ఇప్పుడు ఎంతోమంది ఆదర్శం.!

Previous articleఓయ్ సినిమాలో శ్రీలక్ష్మి గా నటించిన ఈ చిన్నపిల్ల గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?
Next articleసెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా ఎందుకు విడిపోతున్నారు..? ఇందుకు కారణాలు ఏంటంటే..?