Ads
మలయాళం హీరో అయినా సరే తెలుగులో కొన్ని సినిమాలు చేసి పేరు సంపాదించుకున్న హీరో మమ్ముట్టి. ఈ వయసులో కూడా ఆయన వివిధ రకమైన పాత్రలని చేస్తున్నారు. అలా ఇటీవల భ్రమయుగం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించారు.
ఇందులో మమ్ముట్టి పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంది. అయితే ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ, తెలుగులో మాత్రం లిమిటెడ్ థియేటర్లు మాత్రమే ఇచ్చారు. మొదట ఈ సినిమాని మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలి అని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, కేవలం మలయాళం భాషలో మాత్రమే ఈ సినిమా విడుదల చేశారు. దాంతో సినిమా చూసిన మలయాళ ప్రేక్షకులు మమ్ముట్టి నటనని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా రెండు కాలాల నేపథ్యంలో తీశారు. హారర్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమాలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో ఉండే కోడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మహల్ లోకి తేవన్ అనే ఒక వ్యక్తి వస్తాడు. తేవన్ ఒక గాయకుడు.
Ads
ఆ మహల్ లోకి ప్రవేశించాక అతని ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి. ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమాలో నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు అని అంటున్నారు అందులోని ముఖ్యంగా మమ్ముట్టి పాత్ర అయితే సినిమా మొత్తానికి చాలా పెద్ద హైలైట్ అయ్యింది అని, అసలు సినిమా చూస్తున్నంత సేపు మమ్ముట్టి అనే నటుడు కాకుండా, ఆ పాత్ర మాత్రమే గుర్తొస్తుంది అని పొగుడుతున్నారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది అని, క్లైమాక్స్ లో మమ్ముట్టి నటన అద్భుతంగా ఉంది అని అంటున్నారు. ఇది మమ్ముట్టి కెరీర్ లో మరొక గుర్తు పెట్టుకోదగ్గ సినిమా అని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ ఈ సినిమా నిర్మించారు. క్రిస్టో జేవియర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ప్రకటించలేదు. ఈ విషయం కోసం అధికారిక ప్రకటన వచ్చే అంతవరకు రావాల్సిందే.
ALSO READ : ఓయ్ సినిమా రీ-రిలీజ్ సందడి అంతా ఒక ఎత్తు… ఈ అమ్మాయి డాన్స్ మరొక ఎత్తు..! ఈమె ఎవరో తెలుసా..?