ఓయ్ సినిమా రీ-రిలీజ్ సందడి అంతా ఒక ఎత్తు… ఈ అమ్మాయి డాన్స్ మరొక ఎత్తు..! ఈమె ఎవరో తెలుసా..?

Ads

ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ఓయ్ ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రెస్పాన్స్ మామూలుగా రాలేదు. థియేటర్లలో జనాలు నిండిపోయారు. దాదాపు 13 సంవత్సరాల క్రితం ఈ సినిమా విడుదల అయినప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు.

కానీ ఇప్పుడు మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చూసి సినిమా బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్ అనే సంగతి తెలిసిందే. దాంతో నిన్న సినిమా థియేటర్ లో పాటలు ప్లే అవుతున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆ పాటతో కలిసి పాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ పాటలు ప్రేక్షకులకు ఎంత ఎక్కేసాయో అర్థం అయిపోతోంది.

woman who danced at oy movie re release theatre

థియేటర్ లో సందడి కూడా గట్టిగానే చేశారు. పేపర్లు ఎగిరేయడం, అరవడం ఇలా చాలా చేశారు. అయితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక థియేటర్ లో ఒక అమ్మాయి చేసింది మరొక ఎత్తు. అనుకోలేదేనాడు అనే పాటకి ఆ అమ్మాయి థియేటర్ లోనే డాన్స్ చేసింది. చీర కట్టుకొని ఆ అమ్మాయి చేస్తున్న డాన్స్ ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ అమ్మాయి ఎవరా అని వెతకడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి పేరు మౌనిక పట్నాయక్.

woman who danced at oy movie re release theatre

మౌనిక పట్నాయక్ ఎంబీఏ చదివారు. కూచిపూడి టీచర్ కూడా. అంతే కాకుండా 2023 లో బెస్ట్ టాలెంట్ ఆఫ్ మిస్ విశాఖ టైటిల్ కూడా అందుకున్నారు. 23 ఏళ్ల మౌనిక పట్నాయక్, నృత్య భారతి డాన్స్ అకాడమీలో టీచర్ గా చేస్తున్నారు. ఎంతో మంది పిల్లలకు కూచిపూడి నేర్పిస్తున్నారు.

నిన్న థియేటర్ లో డాన్స్ చేసి ఫేమస్ అయ్యారు. ఎన్నో సోషల్ మీడియా పేజెస్ మౌనిక చేసిన డాన్స్ ని మెచ్చుకుంటూ ఆ వీడియోని షేర్ చేశాయి. అందుకు మౌనిక కూడా స్పందించి తన వీడియోని షేర్ చేసినందుకు థాంక్యూ అని తెలిపారు. ఒక్క డాన్స్ వీడియోతో మౌనిక పట్నాయక్ ఇంకా ఫేమస్ అయ్యారు.

ఈ వీడియో దర్శకుడు ఆనంద్ రంగా వరకు వెళ్ళింది. ఆనంద్ రంగా మౌనికని మెచ్చుకోవడం మాత్రమే కాకుండా, ఆనంద్ రంగా అసోసియేట్ గౌతమ్ కూడా మౌనికకి మెసేజ్ చేసి, సిద్ధార్థ్ ఈ వీడియో సోషల్ మీడియాలో చూశారు అని, ఈ శుక్రవారం నాడు సిద్ధార్థ్ ఓయ్ సినిమా చూడటానికి హైదరాబాద్ వస్తున్నారు అని, ఒకవేళ కలిసే ఆసక్తి ఉంటే చెప్పమని చెప్పారు. ఈ విషయాన్ని మౌనిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి థాంక్యూ తెలిపారు. ఇంకా చాలా మంది మౌనిక డాన్స్ ని మెచ్చుకుంటున్నారు.

watch video : 

ALSO READ : ఈ 7 మంది హీరోయిన్లు బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉన్నారు అనుకుంటా…? చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ ఇవే.!

Previous articleత్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు… కానీ అంతలోనే బ్రేకప్ ప్రకటించిన నటి..! కారణం ఏంటి..?
Next articleఇంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా సైలెంట్ గా విడుదల అయ్యిందా..? ఈ సినిమా స్పెషలిటీ ఏంటంటే..?