Ads
ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా చేసి, అవార్డులు, గుర్తింపు అందుకున్నారు సెంథిల్ కుమార్. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకి సెంథిల్ కుమార్ పనిచేశారు. సెంథిల్ కుమార్ భార్య రూహీ ఇవాళ తుది శ్వాస విడిచారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. 2009లో వీరి పెళ్లి జరిగింది. రూహీ ఒక యోగా శిక్షకురాలు.
అనుష్క శెట్టితో చాలా కాలం పని చేశారు. కోవిడ్ వచ్చిన తర్వాత నుండి రూహీకి అనారోగ్య సమస్యలు వచ్చాయి. అప్పటి నుండి ఆవిడ చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు రూహీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. రూహీ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో ఆవిడ మరణించినట్లు వైద్యులు చెప్పారు. రూహీ కిమ్స్ ఆస్పత్రిలో పొందారు.
Ads
ఈ వార్త విన్న ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రూహీకి నివాళులు అర్పిస్తున్నారు. రేపు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఉదయం 9 గంటలకి రూహీ అంత్యక్రియలు జరుగుతాయి. రూహీ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండడంతో, ఆమెకి జాగ్రత్తలు తీసుకోవడానికి కొంత కాలం నుండి సెంథిల్ కుమార్ సినిమాలకు కూడా దూరంగా ఉన్నట్టు వార్త వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెంథిల్ కుమార్ తన కెమెరా వర్క్ కి ఇప్పటి వరకు చాలా అవార్డులు అందుకున్నారు. అవార్డు అందుకున్న ప్రతి షోకి తన భార్యని కచ్చితంగా తీసుకెళ్లారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తన భార్య అని చాలా సార్లు చెప్పారు.
ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా తన భార్యని తప్పకుండా తీసుకు వెళ్లేవారు. మగవాడి సక్సెస్ వెనక ఆడవాళ్లు ఉంటారు అని అనడానికి ఈ జంట ఒక ఉదాహరణ. రూహీకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. తెర మీద కనిపించకపోయినా కూడా సినీ ప్రముఖులకి రూహీ చాలా ఆప్తురాలు. సెంథిల్ కుమార్ తో చాలా సార్లు ఎన్నో ఈవెంట్స్ కి హాజరు అయ్యారు. కొన్ని సార్లు అయితే సెంథిల్ కుమార్ స్టేజ్ మీద తన భార్య తనకి చాలా సపోర్ట్ చేశారు అని ,రూహీకి థాంక్యూ కూడా చెప్పారు. అలా ఎన్నో ఈవెంట్స్ లో కనిపించారు.