సందడిగా టిఎస్ఎఫ్ఏ – 2023 (తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్) 2023.

Ads

ఎవర్ గ్రీన్ గా సోషల్ మీడియా మాధ్యమాలు వేణు స్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద. మాదాపూర్ టి-హబ్ లో జరిగిన టిఎస్ఎఫ్ఏ అవార్డ్స్ 2023 ను ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద తో కలసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జ్యోతి ప్రజల్వ చేసి ఆరభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల తరపున యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను ప్రధానం చేయడం తో పాటు టిఎస్ఎఫ్ఏ – 2024 (తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్) పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.

అనంతరం వేణుస్వామి మాట్లాడుతూ మీడియా మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాకు ఎంతో క్రేజ్ పెరిగిందన్నారు. ఎంటరైటైన్ మెంట్, కామెడీ, టాలెంట్ వంటి వివిధ రంగాల్లో స్టోరీ మేకింగ్ ఇలా..ఎన్నో విషయాల్లో ఇప్పుడు యుట్యూబ్, ఇస్టా ప్లాట్ ఫామ్స్ ల్లో నేటి యువత స్టార్స్ గా ఎదగడం తో పాటు..స్వయం ఉపాధి కూడా పొందుతున్నారన్నారు.

Ads

తమదైన శైలిలో యూ ట్యూబ్, ఇస్టాలో అభిమానాన్ని చూరగొంటున్న ఈ స్టార్స్ ను మరింత ప్రోత్సాహం అందించేందుకు కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్ అధినేత శ్రీనివాస్ మర్రి గారు 6th ఎడిషన్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్, తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహకులు, కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్ అధినేత శ్రీనివాస్ మర్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా..నెటీ జన్ల అభిమానానాన్ని చూరగొంటున్న యూ ట్యూబ్, ఇస్టా ఇన్ ప్లూయెన్సర్లకు వివిధ క్యాటగిరిలో అవార్డులకు ఎంపిక చేశామన్నారు. త్వరలో తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024 కూడా నిర్వహించనున్నామని తెలిపారు.

Previous article2021 లో పెళ్లి… ఏడాదికే విడాకులు… ఇప్పుడు మరొక పెళ్లి..! శంకర్ కూతురు మొదటి భర్తతో విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
Next articleఅసలు ఆర్టికల్ 370 ని ఎందుకు రద్దు చేసారు..? ఈ సినిమా మీద ఇన్ని నెగటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.