2021 లో పెళ్లి… ఏడాదికే విడాకులు… ఇప్పుడు మరొక పెళ్లి..! శంకర్ కూతురు మొదటి భర్తతో విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Ads

దర్శకుడు శంకర్. పరిచయం అవసరం లేని వ్యక్తి. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో సినిమాలు తీసి, ఎన్నో అవార్డులు సంపాదించారు. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ గారు హీరోగా నటిస్తున్న ఇండియన్ 2, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలు రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే శంకర్ కి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. శంకర్ కూతురి ఎంగేజ్మెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య శంకర్. ఐశ్వర్య శంకర్ పెద్ద కూతురు. తరుణ్ కార్తికేయన్ శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్.

shankar daughter aishwarya enagagement

అతనితోనే ఐశ్వర్య ఎంగేజ్మెంట్ జరిగింది. తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాకుండా పాటలు రాస్తారు. అంతే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా కొన్ని పాటలు పాడారు. అయితే ఐశ్వర్యకి 2021 లో క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో మహాబలిపురంలో ఘనంగా పెళ్లి జరిగింది. కానీ పెళ్లి అయిన ఏడాదికే వీరు విడిపోయారు. రోహిత్ కి పోక్సో కేస్ లో ప్రమేయం ఉంది అనే వార్త ఒకటి బయటికి వచ్చింది. అంతే కాకుండా రోహిత్ ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తారు.

Ads

shankar daughter aishwarya enagagement

అందులో మహిళా ఆటగాళ్లతో రోహిత్ అసభ్యంగా ప్రవర్తించారు అని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఐశ్వర్య రోహిత్ నుండి విడిపోయారు. ఇప్పుడు తరుణ్ తో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలని శంకర్ రెండవ కూతురు, హీరోయిన్ అదితి శంకర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. విడాకుల తర్వాత నుండి ఐశ్వర్య శంకర్ తోనే ఉంటున్నారు.

shankar daughter aishwarya enagagement

ఐశ్వర్య ఒక డాక్టర్. రెండవ కూతురు అదితి కొంత కాలం క్రితం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అదితి హీరోయిన్ మాత్రమే కాకుండా పాటలు కూడా పాడుతారు. శంకర్ కొడుకు పేరు అర్జిత్ శంకర్. అతను కూడా సినిమాల్లోకి వచ్చేందుకే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక తమిళ్ సినిమాతో యాక్టర్ గా కెరీర్ మొదలు పెడతారు అనే వార్త వచ్చింది.

ALSO READ : చిరంజీవి పక్కనే నిలబడ్డ ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous article“మలైకా అరోరా” నుండి… “సమంత” వరకు… “ఐటెం సాంగ్స్” కి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న 6 హీరోయిన్లు..!
Next articleసందడిగా టిఎస్ఎఫ్ఏ – 2023 (తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్) 2023.