“సురేఖ” పేరు మీద “ఉపాసన” మొదలు పెట్టిన ఈ కొత్త వెబ్ సైట్ లో… పదార్థాల ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ads

చిరంజీవితో పాటు చిరంజీవి కుటుంబం కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. చిరంజీవి భార్యగా, అల్లు రామలింగయ్య గారి కూతురిగా సురేఖ గారు అందరికీ పరిచయమే. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉంటారు. చిరంజీవితో పాటు ఈవెంట్స్ కి హాజరు అవుతూ ఉంటారు.

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడైనా ఒకసారి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ రామ్ చరణ్, ఉపాసన మాత్రం సురేఖ గారితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటారు. అయితే సురేఖ గారు నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సురేఖ గారికి ఉపాసన ఒక బహుమతి ఇచ్చారు.

upasana konidela surekha konidela athammas kitchen products cost

అత్తమ్మ’స్ కిచెన్ పేరుతో ఒక వెబ్ సైట్ లాంచ్ చేశారు. నిన్న సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తని ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇందులో తెలుగు సాంప్రదాయ పద్ధతితో తయారు చేసే వంటలకు సంబంధించిన ఇన్స్టంట్ మిక్స్ పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఫేమస్ అయిన వంటల పౌడర్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్, పులిహోర పేస్ట్, రసం పౌడర్ అందుబాటులో ఉన్నాయి.

upasana konidela surekha konidela athammas kitchen products cost

Ads

అయితే ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న వెబ్ సైట్ కావడంతో కేవలం ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి ధర మీద మాత్రం అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నాలుగు కలిపి ఒకే ప్యాక్ కింద విక్రయిస్తున్నారు. దీని ధర 1,099.00 రూపాయలు ఉంది. ఇవి 700 గ్రాములు ఉంటాయి. ఇలా చూస్తే ఒక్కొక్కటి 250 ఉన్నట్టు లెక్క. బయట మార్కెట్ లో ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు.

upasana konidela surekha konidela athammas kitchen products cost

కానీ వాటి ధర మాత్రం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే అంత తక్కువగానే ఉంటుంది. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా, ఎంత నాణ్యమైన పదార్థాలు ఉపయోగించినా కూడా ఇలాంటివి సామాన్యులు కూడా ఎక్కువగా ఉపయోగించాలి అని ఆశిస్తారు కాబట్టి వాటి ధరలు అంత ఎక్కువగా అయితే ఉండవు.

upasana konidela surekha konidela athammas kitchen products cost

కానీ దీంట్లో మాత్రం 250 రూపాయలకి ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే మామూలుగా ఈ ధరకి 3,4 మంచి బ్రాండ్ ఉన్న ప్రొడక్ట్స్ వస్తాయి అని అంటున్నారు. “దాంతో ఈ ఆలోచన మంచిది కానీ, ధర ఇంకొంచెం తక్కువగా ఉండి ఉంటే బాగుండేది” అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం, “ప్యాకేజ్ ఫుడ్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు?” అని అంటున్నారు. “ఇంత ధర పెట్టి కొనుక్కునే బదులు స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఇంకా తక్కువ ధర అవుతుంది” అని కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : చిరంజీవి పక్కనే నిలబడ్డ ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous article19 ఏళ్లకే దంగల్ నటి మరణించడానికి కారణం ఇదేనా..? 2 నెలల క్రితమే ఇలా జరగడంతో..?
Next articleతెలుగులో మొదటి తరం హాస్యనటుల ఫోటో చూశారా..? ఇందులో ఎవరెవరు ఉన్నారంటే..?