తెలుగులో మొదటి తరం హాస్యనటుల ఫోటో చూశారా..? ఇందులో ఎవరెవరు ఉన్నారంటే..?

Ads

సినిమా అన్నాక హీరోలు, హీరోయిన్లతో పాటు మరొక ముఖ్యమైన నటులు కమెడియన్స్. కామెడీ చేయడం అంటే చిన్న విషయం కాదు. తమ డైలాగ్స్ తో, ఎక్స్ప్రెషన్స్ తో జనాలని నవ్వించాలి. అలానే కామెడీ అంటే మరీ ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా కాదు.

సింపుల్ గా చేసి నవ్వించిన వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కమెడియన్స్ అంటే వెన్నెల కిషోర్, సత్య. కొంత కాలం క్రితం వరకు బ్రహ్మానందం గారు, అలీ. వీళ్ళు ఇప్పటికి కూడా సినిమాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఒక సినిమాలో నటిస్తున్నారు.

comedians old photo

అయితే, ఈ కమెడియన్స్ యొక్క కామెడీ టైమింగ్ వల్ల మాత్రమే హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సినిమా అంటే చాలా మందికి అందులో ఉన్న జోక్స్ గుర్తొస్తాయి. అవి గుర్తొస్తే ఆ పాత్రలో నటించిన కమెడియన్ గుర్తొస్తారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని నవ్వించడం కంటే పెద్ద టాస్క్ ఉండదు. దాన్ని కమెడియన్స్ చాలా సులభంగా చేస్తారు. వ్యక్తిగతంగా వారు ఆ రోజు ఎలాంటి మూడ్ లో ఉన్నా కూడా తెర మీద ఎనర్జిటిక్ గా చేసి నవ్విస్తారు.

Ads

comedians old photo
image source: Twitter (Telugu Cinema History)

ఎంతో కాలం నుండి ఎన్నో వందల మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పైన మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న వాళ్లు కూడా కమెడియన్స్. కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్న కమెడియన్స్ కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి తరం కమెడియన్స్. ఇందులో కొంత మంది మనకి తెలిసిన వారు ఉంటే, కొంత మంది మాత్రం ఆ తర్వాత ఎక్కువగా సినిమాల్లో చేయలేదు. ఈ ఫోటోలో ఉన్న కమెడియన్స్ ఎవరంటే,

comedians old photo

(ఎడమ నుండి కుడి వైపుకి)

కింద కూర్చున్న వాళ్లు :

 • కాకరాల సత్యనారాయణ
 • పొట్టి ప్రసాద్
 • గణేష్

కుర్చీల్లో కూర్చున్న వారు :

 • బాలకృష్ణ
 • రాజబాబు
 • సీతారాం
 • రమణారెడ్డి
 • రేలంగి
 • పద్మనాభం
 • అల్లు రామలింగయ్య

నిల్చున్న వారు

 • రావి కొండలరావు
 • మోదుకూరు సత్యం
 • రామచంద్రరావు
 • కె.వి చలం
 • చలం

వీరిలో కొంత మంది కమెడియన్స్ ఇటీవల కూడా సినిమాలు చేశారు. కానీ ఎన్ని తరాలు దాటినా, ఎంత మంది హాస్యనటులు వచ్చినా కూడా వీరు అందరికీ గుర్తుండిపోతారు.

ALSO READ : వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అంటే..?

Previous article“సురేఖ” పేరు మీద “ఉపాసన” మొదలు పెట్టిన ఈ కొత్త వెబ్ సైట్ లో… పదార్థాల ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleజనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులని పెట్టబోతున్నారా..? ఎంతంటే..?