Ads
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక వ్యక్తి పేరు కుమారి ఆంటీ. ఫుడ్ స్టాల్ తో ఫేమస్ అయిన ఆంటీ. ఇప్పుడు టీవీలో ఈవెంట్స్ కి కూడా హాజరు అవుతున్నారు. అమాంతంగా ఫేమ్ వచ్చింది. సినిమా వాళ్లు కూడా ఆమె ఫుడ్ స్టాల్ కి వెళ్లి వారి సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, ప్రముఖ సీరియల్ నటి, బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ కీర్తి భట్, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లారు. కీర్తి భర్త కార్తీక్, కీర్తిని సర్ప్రైజ్ చేయడానికి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి తీసుకువెళ్లారు. కానీ అక్కడ చూస్తే కుమారి ఆంటీ లేరు. టీవీ షోస్, ప్రమోషన్ వీడియోలతో కుమారి ఆంటీ బిజీగా ఉన్నారు అని అక్కడ వారు చెప్పారట.
కానీ అంత దూరం ఎలాగో వెళ్లారు కాబట్టి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి తిని చూద్దాం అనుకొని ఆర్డర్ చేశారు. ఫుడ్ తిన్న కీర్తి షాక్ అయ్యారు. చాలా కారం ఉందట. దాంతో ప్లేట్ వదిలేసి మరొక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర భోజనం చేశారు. ఈ విషయంపై వాళ్లు మాట్లాడుతూ, “అసలు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి ఇంత హైప్ ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు అని” అన్నారు. ఒక్క ముద్ద తినేసరికి తాను కళ్ళు మూసేసుకున్నాను అని కీర్తి అన్నారు.
Ads
ఆమె భోజనానికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంత పాపులారిటీ వచ్చింది కానీ నిజంగా అంత ఏమీ లేదు అని, అసలు కుమారి ఆంటీ కంటే చికెన్ తానే బాగా చేస్తాను అని అన్నారు. అంతే కాకుండా 4 చికెన్ ముక్కలకి 170 రూపాయలు తీసుకుంటున్నారు అని, అంత డబ్బులకి ఆ భోజనం విలువకి సంబంధం లేదు అని అన్నారు. ఇక్కడ భోజనం అంత పెద్దగా బాలేదు అని పక్కనే ఉన్న వేరే వాళ్ళ దగ్గర తింటే ఆ ఫుడ్ ఇంకా చాలా బెటర్ అని అన్నారు.
“మాకు నచ్చలేదు అన్నంత మాత్రాన అందరికీ నచ్చదు అని కాదు. మా అభిప్రాయం మేము చెప్తున్నాం అంతే” అని కీర్తి దంపతులు చెప్పారు. కింద చాలా మంది కూడా, “అక్కడ ఫుడ్ అంతగా బాలేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది అయితే, “ఇలా చెప్పేయడం కరెక్ట్ కాదు” అంటున్నారు. ఒక కామెంట్ కి కీర్తి, “మా అభిప్రాయం మేము చెప్పాం” అని రిప్లై ఇచ్చారు.
watch video :
ALSO READ : ”మెగాస్టార్ చిరంజీవి” ఆస్తి మొత్తం ఎంత ఉంటుందో తెలుసా..?