5 కోట్ల బడ్జెట్… హైదరాబాద్ బ్యాక్ డ్రాప్… కట్ చేస్తే కలెక్షన్ల వర్షం..! అసలు అంతగా ఈ సినిమాలో ఏం ఉంది..?

Ads

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ఏదైనా సాంగ్ షూట్ ఉంటే వేరే లొకేషన్స్ కి వెళ్లడం కామన్. పాట కోసం చెన్నై, కేరళ వంటి ఎన్నో లొకేషన్స్ కి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు.

కానీ అక్కడివాళ్లు మన హైదరాబాద్ కి కానీ, లేదా తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రదేశానికి కానీ వచ్చి సినిమా తీయడం అనేది అరుదుగా జరిగే విషయం. అలా ఇటీవల ఒక మలయాళం సినిమా మొత్తం కూడా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుంది.  5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 26 కోట్లు వసూలు చేసింది.

malayalam movie with hyderabad backdrop

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాపిక్ నడుస్తోంది. ఈ సినిమా పేరు ప్రేమాలు. ఈ సినిమాకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ లతో కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో నస్లెన్ కె. గఫూర్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించారు.  కథ విషయానికి వస్తే సచిన్ (నాస్లెన్ కె. గఫూర్), ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. సచిన్ చాలా పిరికివాడు. కాలేజ్ సమయంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమని ఆ అమ్మాయికి చెప్పలేకపోతాడు. గ్రాడ్యుయేషన్ అయిపోయాక యూకే వెళ్లాలి అనుకుంటాడు.

malayalam movie with hyderabad backdrop

కానీ అతని వీసా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సచిన్ తన సొంత ఊరికి తిరిగి వెళ్లలేక, స్నేహితుడు అమల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్) ని తనకు సహాయం చేయమని అడుగుతాడు. మరొక పక్క అమల్ డేవిస్ హైదరాబాద్ లో గేట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు. దాంతో సచిన్ ని కూడా హైదరాబాద్ కి తీసుకెళ్తాడు. ఒక సమయంలో సచిన్, రీను (మమిత బైజు) ని చూసి ఇష్టపడతాడు. అయితే రీను ఎలాంటి అబ్బాయిని అయితే కోరుకుంటుందో, సచిన్ కి ఆ లక్షణాలు ఉండవు. తర్వాత వారిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. ఆ స్నేహం ప్రేమగా మారిందా? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Ads

malayalam movie with hyderabad backdrop

సినిమా స్టోరీ చాలా సింపుల్ గానే ఉంటుంది. అసలు ఒక మంచి సినిమా తీయాలి అంటే కాంప్లెక్స్ స్టోరీ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ స్టోరీని స్ట్రైట్ గా ప్రజెంట్ చేస్తే చాలు. ఈ సినిమా కూడా అలాగే ఉంది. కామెడీ బాగుంది. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ కి అయితే పూర్తి మార్కులు ఇవ్వచ్చు ఏమో.  విష్ణు విజయ్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ బొమ్మలు అనే ఒక పాట కూడా ఉంటుంది. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక హైలైట్.

malayalam movie with hyderabad backdrop

అయితే, హీరో ఊరికి సంబంధించిన విషయాలు ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. కొన్ని చోట్ల మాత్రం కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే. సినిమా మొత్తం గా చూస్తే ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించే లాగా ఉండదు. ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ప్రస్తుతం అయితే ఈ సినిమా మలయాళంలో మాత్రమే ఉంది. మరి ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు తెలుగులో కూడా డబ్ చేస్తారు ఏమో. కానీ ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఉంది కాబట్టి ఓటీటీకి రావాలి అంటే ఇంకా కొంత సమయం వరకు వేచి చూడాల్సిందే.

ALSO READ : “ఇంత హైప్ ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు… ఫుడ్ అస్సలు బాలేదు..!” అంటూ… “కుమారి ఆంటీ”పై నటి కీర్తి భట్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

Previous article“ఇంత హైప్ ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు… ఫుడ్ అస్సలు బాలేదు..!” అంటూ… “కుమారి ఆంటీ”పై నటి కీర్తి భట్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?
Next articleఅప్పట్లో షారుఖ్ ఖాన్, మహేష్ బాబు వంటి స్టార్లు ప్రమోట్ చేసిన “బైజూస్” పరిస్థితి ఇప్పుడు ఇలా తయారయ్యింది ఏంటి..? ఏం జరిగిందంటే..?