Ads
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీ అధినేతలు ఇప్పటికే ఏ ఏ ప్రాంతంలో ఎవరు పోటీ చేయాలి అంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనులలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అంటేనే అనకాపల్లికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పాలి ఈ క్రమంలోనే అనకాపల్లి నుంచి పోటీ చేయడం కోసం ఎంతోమంది రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పోటీపడుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఒక్కో పార్టీ నుంచి ఏకంగా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడం కోసం ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో పార్టీ అధినేతలు కూడా అయోమయంలో పడుతుంటారు అయితే తాజాగా అనకాపల్లి ఎంపీగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
Ads
అనకాపల్లి ప్రాంతంలో మాత్రమే కాకుండా హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రధాన నగరాలలో కూడా ఎం.వి.ఆర్ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈయన గత 40 సంవత్సరాలుగా టెక్స్ టైల్స్ రంగంలో దూసుకుపోతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు కేవలం వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఎన్నో సహాయ సహకారాలు చేశారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
ఇలా వ్యక్తిగతంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఎంవీఆర్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈయనకు తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడానికి రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అనకాపల్లి స్థానం మాత్రం జనసేన పార్టీకి ఇవ్వాలని ఇక్కడి నుంచి తన సోదరుడు నాగబాబును ఎన్నికల బరిలో నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం గురించి త్వరలోనే అధికారకంగా ప్రకటన వెలువడనుంది.