Ads
ప్రముఖ నిర్మాత, గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు గ్రహీత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయిన డాక్టర్ డి.రామానాయుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడో కారంచేడు నుంచి వచ్చి వరల్డ్ స్థాయి రికార్డు సాధించిన ఆయన సక్సెస్ఫుల్ జర్నీ గురించి ఒకసారి తెలుసుకుందాం.
రామానాయుడు 1936లో ప్రకాశం జిల్లా కారంచేడు లో రైతు కుటుంబంలో జన్మించాడు. మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోవడంతో పిన తల్లి వద్ద గారాబంగా పెరిగాడు. తర్వాత బంధువు ఇంట్లో ఉండి ఎస్.ఎస్.ఎల్.సి విద్యాభ్యాసం చేశాడు.
ఆ తర్వాత పై చదువుల కోసం కాలేజీలో చేరినప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలలో, కాలేజీ రాజకీయాలలో దృష్టి పెట్టిన రామానాయుడు చదువుపై దృష్టి సాధించలేదు. మేనమామ కూతురు రాజేశ్వరితో పెళ్లి జరిగింది. తర్వాత వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరూ కొడుకులు లక్ష్మీ అనే కూతురు పుట్టారు. రామానాయుడు ఎప్పుడూ అందరికన్నా తన చెయ్యి పైన ఉండాలని భావించే వ్యక్తి. అలాగే సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో రామానాయుడు దిట్ట. నమ్మినబంటు షూటింగ్ కారంచేడులో జరిగినప్పుడు అందులో ఒక సీన్లో రామానాయుడు నటించి సినిమా వాళ్ళ దృష్టిలో పడ్డాడు.
Ads
మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అక్కినేని అడిగినప్పుడు వ్యవసాయం తప్పించి మరొక ఆలోచన లేదు అని చెప్పాడు రామానాయుడు. తర్వాత ఇష్టం లేకపోయినా రైస్ మిల్ వ్యాపారం పెట్టాడు. ఒకరోజు సేల్స్ టాక్స్ వాళ్ళు వచ్చి బిల్లులు రాయటం లేదంటూ రెండు లక్షల రూపాయలు జరీమానా విధించారు. దాంతో వ్యాపారం మీద విరక్తి చెంది మిల్లు మూసేసి చెన్నై వచ్చేసాడు.
మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు. తర్వాత కొన్ని బిజినెస్ లు ప్రారంభించి నష్టాలు చవి చూసాడు. తర్వాత కాలక్షేపం కోసం తోడల్లుడుతో కలిసి కల్చరల్ అసోసియేషన్ కి వెళ్లేవారు రామానాయుడు . అక్కడ అనురాగం చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నారని తెలియటంతో తండ్రిని ఒప్పించి అనురాగం చిత్రాన్ని నిర్మించి తొలి విజయం అందుకున్నారు రామానాయుడు.
తర్వాత 1964 లో ఎన్టీఆర్ కథానాయకుడుగా రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత భారీ నష్టాలు చవి చూసినప్పటికీ 1971లో ప్రేమనగర్ చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత వెనుతిరిగి చూడవలసిన అవసరం రాలేదు రామానాయుడు కి. ఈయన 21 మంది కొత్త దర్శకులని, ఆరుగురు హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 2015లో క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించడం బాధాకరం. ఆయన విజయానికి ఆయన సమయస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాలే కారణం అంటారు ఆయనని తెలిసిన వాళ్ళు.
ALSO READ : జయలలిత, శోభన్ బాబు ప్రేమించుకున్నారా..? శోభన్ బాబు డైరీలో ఏం రాశారు..?