68 ఏళ్ల చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు… ఒకరికి 35… ఒకరికి 30..! ఇదెలా సాధ్యం..?

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ త్రిష కూడా పాల్గొన్నారు. అలా ఈ సినిమాలో హీరోయిన్ త్రిష అని ప్రకటించారు.

అయితే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అనే వార్త మాత్రం ఎప్పటి నుండో వస్తూనే ఉంది. త్రిష మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఇంకొక ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారు. వారు ఎవరు అనే సందేహం నెలకొంది. ఇప్పుడు మాత్రం ఇద్దరు హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చాయి.

these heroines to act in chiranjeevi vishwambhara movie

వీళ్ళిద్దరూ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకరు ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇషా చావ్లా అయితే, మరొకరు నానితో పాటు జెంటిల్ మెన్ సినిమాలో నటించిన సురభి. ఇషా చావ్లా వయసు 35 సంవత్సరాలు. సురభి వయసు 30 సంవత్సరాలు. వీళ్ళిద్దరి పాత్రలు తెలియదు. కానీ ఇషా చావ్లాకి చిరంజీవికి 33 సంవత్సరాల వయసు తేడా ఉంది. అదే సురభికి, చిరంజీవికి అయితే 38 సంవత్సరాల వయసు తేడా ఉంది.

Ads

these heroines to act in chiranjeevi vishwambhara movie

మరి వీళ్ళు కలిసి నటిస్తే చూడడానికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే, చిరంజీవిని యంగ్ గా చూపిస్తే వీళ్ళు ఆయన పక్కన బాగానే ఉంటారు. సురభి అయితే, చిరంజీవితో తనకి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అని కూడా చెప్పారు. మరి వీరిద్దరి పాత్రలు ఏంటి అనేది తెలియదు. ఇంక సినిమా విషయానికి వస్తే, సోషియో ఫాంటసీ జానర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

these heroines to act in chiranjeevi vishwambhara movie

ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత చిరంజీవి మళ్ళీ అలాంటి ఒక పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. చిరంజీవి ఈ పాత్ర కోసం ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతున్నారు. జిమ్ లో చాలా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ALSO READ : రామానాయుడు తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయం వల్ల దగ్గుబాటి ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉన్నారా..? అదేంటంటే..?

Previous articleరామానాయుడు తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయం వల్ల దగ్గుబాటి ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉన్నారా..? అదేంటంటే..?
Next articleనాని “సరిపోదా శనివారం” టీజర్‌లో ఈ సీన్ గమనించారా..? ఆ సినిమా గుర్తొస్తోంది ఏంటి..?