జయలలిత, శోభన్ బాబు ప్రేమించుకున్నారా..? శోభన్ బాబు డైరీలో ఏం రాశారు..?

Ads

సీనియర్ తమిళ నటి జయలలిత గురించి తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే సినిమాల్లో అడుగు పెట్టి, ఎన్నో హిట్ సినిమాల్లో నటించి, తలైవి అనే గుర్తింపు సంపాదించుకొని, తర్వాత రాజకీయాల్లో కూడా ఎదిగిన నటి జయలలిత.

జయలలిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. కొన్ని పుకార్లు అయితే, కొన్ని ఆధారం లేని వార్తలు ఉంటాయి. వాటిలో ఎంత వరకు ఏది నిజం అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

jayalalithaa shobhan babu relationship

అలాంటి ఒక వార్త జయలలిత, శోభన్ బాబు మధ్య ఉన్న బంధం. వీరిద్దరూ కలిసి డాక్టర్ బాబు అనే సినిమాలో నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా కూడా ఈ ఒక్క సినిమా మాత్రమే. సినిమా షూటింగ్ జరిగే కొన్ని రోజుల ముందు జయలలిత తల్లి మరణించారు. దాంతో శోభన్ బాబులో జయలలిత తన తల్లిని చూసుకున్నారు అని అన్నారు. ఈ విషయాన్ని శోభన్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది.

jayalalithaa shobhan babu relationship

Ads

ఆ సమయంలో శోభన్ బాబు జయలలిత గురించి తన డైరీలో రాసుకున్నారు. “బరువైన నా మనసుని నీ జోకులతో తెలియక చేశావు. ప్రపంచం అంతా ఇప్పుడు నిశ్చలంగా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలి అని, కలిసి ఉండాలి అని అనిపిస్తోంది” అని జయలలిత శోభన్ బాబుతో చెప్పినట్టు ఆయన తన డైరీలో రాశారు. ఇది మాత్రమే కాకుండా, “నా తల్లి మరణించి సంవత్సరం కూడా కాలేదు. కానీ ఎన్నో సంవత్సరాలు అయినట్లు అనిపిస్తోంది. నా అనుకున్న వాళ్లు అందరూ నన్ను మోసం చేశారు.”

jayalalithaa shobhan babu relationship

“బంధువులు కూడా డబ్బు కోసం ఉన్నారు. ఎవరి నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే విషయం తెలియట్లేదు ఇలాంటి ఎన్నో బాధల నుండి మీరు వచ్చాక విముక్తి కలిగింది” అని జయలలిత శోభన్ బాబుతో చెప్పినట్టు తన డైరీలో రాశారు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్నది మాత్రం ప్రేమ కాదు. కేవలం తండ్రి కూతుళ్ళ మధ్య ఎలాంటి అనుబంధం అయితే ఉంటుందో, అలాంటి అనుబంధం మాత్రమే వీరి మధ్యలో ఉంది అనే వార్త వచ్చింది. కానీ వీరిద్దరూ చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. ఈ కారణంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్త వచ్చింది.

ALSO READ : “రకుల్ ప్రీత్ సింగ్” పెళ్లి జరిగిన హోటల్ ఏదో తెలుసా..? అందులో ఒక్క రూంకి ఇంత ఖర్చు అవుతుందా..?

Previous articleదాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఫంక్షన్ లో “నయనతార” కట్టుకున్న ఈ చీర విలువ ఎంతో తెలుసా..?
Next articleఒకే లాగ కనిపించే 13 మంది హీరోయిన్స్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.