Ads
హలో, చిత్రలహరి, రణరంగం వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న నటి కళ్యాణి ప్రియదర్శన్. కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో నటించిన సినిమాలు కొన్నే అయినా కూడా చాలా మందికి అభిమాన నటి అయ్యారు.
ఆ తర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళం సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు మాత్రం తెలుగులోకి కూడా అనువాదం అవుతున్నాయి. ఇటీవల కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఒక సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఆ సినిమా పేరు అంటోనీ.
ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, జోజు జార్జ్ ముఖ్య పాత్రలో నటించారు. సినిమా కథ విషయానికి వస్తే, ఆంటోనీ (జోజు జార్జ్), ఒక గ్యాంగ్ స్టర్. ఒకరోజు ఆంటోనీ జేవియర్ అనే ఒక రౌడీని చంపేస్తాడు. ఆ తర్వాత నుండి జేవియర్ కూతురు అయిన అన్నా మారియా (కళ్యాణి ప్రియదర్శన్)ని ఆంటోనీ చూసుకుంటాడు. అన్నా మారియా ఏమో ఎంఎంఏ లో ట్రైనింగ్ తీసుకుంటుంది. కాలేజ్ లో కోపం ఎక్కువ అనే పేరు కూడా ఉంటుంది.
అయితే వీళ్ళని చంపడానికి టార్జాన్ అనే వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఇవన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, రాజేష్ వర్మ స్టోరీ అందించారు. చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయ రాఘవన్, హరి ప్రశాంత్ ఎం, జీజూ జాన్, బిను పప్పు, సిజోయ్ వర్గీస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మలయాళంలో రూపొందింది. గత సంవత్సరం విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది.
Ads
ఆ తర్వాత మలయాళం భాషలోనే ఓటీటీలో విడుదల అయ్యింది. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. తండ్రి కూతుర్ల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన జోజు జార్జ్ ఇటీవల ఆదికేశవ సినిమాలో కూడా నటించారు. ఆంటోనీ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎంఎంఏ ఫైటర్ పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ చాలా కష్టపడ్డారు.
తనని తాను మార్చుకున్నారు. హెయిర్ స్టైల్ మార్చి జుట్టు పొట్టిగా కట్ చేసుకున్నారు. కొన్ని ఫైటింగ్ చేసే టెక్నిక్స్ కూడా నేర్చుకున్నారు. ఒక ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించడానికి శిక్షణ పొందారు. ఈ క్రమంలో చాలా దెబ్బలు కూడా తగిలాయి. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ సినిమా విడుదల అయ్యాక కళ్యాణి ప్రియదర్శన్ పెర్ఫార్మన్స్ ని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో చూసినవారు కూడా నటీనటుల పర్ఫామెన్స్ ని మెచ్చుకుంటున్నారు.
ALSO READ : రామానాయుడు తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయం వల్ల దగ్గుబాటి ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉన్నారా..? అదేంటంటే..?