“బండారు సత్యనారాయణమూర్తి” తో పాటు… TDP తొలి జాబితాలో సీటు దక్కని తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు వీరే..!

Ads

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాని ఇవాళ ప్రకటించారు. ఇందులో అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. 99 స్థానాల్లో, 94 తెలుగుదేశం పార్టీకి, 5 స్థానాలు జనసేన పార్టీకి కేటాయించారు.

జనసేన అభ్యర్థులని పవన్ కళ్యాణ్ ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే, కొంత మంది సీనియర్ నాయకులకి చోటు దక్కలేదు. వారిలో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు.

వీరితో పాటు పల్లా శ్రీనివాస్, అనకాపల్లి నుండి పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ ఉన్నారు. అనకాపల్లిలో జనసేనకి అసలు బలం లేదు. కానీ అక్కడ జనసేనకి సీట్లు కేటాయించడంతో ఈ విషయం మీద ప్రశ్నిస్తున్నారు. మొదటి జాబితాలో టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చెందిన వారికి చోటు దక్కలేదు. కిమిడి కళా వెంకట్రావుకి కూడా చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళికి వ్యతిరేకంగా వెళ్లడంతో కళా వెంకట్రావు వర్గాన్ని చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టారు అనే వార్త వినిపిస్తోంది.

tdp jsp party leaders who did not allocated seat in first list

Ads

ఇంక జనసేన పార్టీ విషయానికి, వస్తే ఉమ్మడి విశాఖలో, పంచకర్ల రమేష్, బోలిశెట్టి సత్య, తమ్మిరెడ్డి శివశంకర్, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, కోన తాతారావు, వంశీ తదితరులు సీట్లు ఆశించి భంగపడ్డారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకి అనకాపల్లి నుండి సీటు కేటాయించారు. కొణతాల రామకృష్ణ ఇటీవల పార్టీలో చేరారు. దాంతో సీనియర్ నేతలని వదిలేసి, ఇటీవల పార్టీలో చేరిన నాయకుడికి సీటు కేటాయించడం మీద జనసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి జాబితాలో వీళ్ళకి సీట్లు దక్కలేదు.

మరొక పక్క, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చిహ్నాలు కలిపి ఒక సింబల్ కూడా తయారు చేశారు. సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు కలిపి ఈ సింబల్ ఉంది. సోషల్ మీడియాలో టీడీపీ, జేఎస్పీ టుగెదర్ అనే ఒక ట్రెండ్ చేస్తున్నారు. సైకిల్ – గాజు గ్లాసుకే మన ఓటు అనే నినాదాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరొక పక్క ప్రచార కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, సభలు ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ సభలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు దేశంలోనే గొప్ప నాయకుడు అయ్యారు..! ఎవరో తెలుసా..?

Previous articleనాని “సరిపోదా శనివారం” టీజర్‌లో ఈ సీన్ గమనించారా..? ఆ సినిమా గుర్తొస్తోంది ఏంటి..?
Next articleOTT లోకి వచ్చిన ఈ కళ్యాణి ప్రియదర్శన్ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.