Ads
తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయ కేతనం సభకి భారీగా ప్రజలు తరలి వచ్చారు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఇందులో పాల్గొన్నారు.
ఎన్నో వేల మంది ఈ సభకి వచ్చారు. నాయకులు అందరూ కూడా ప్రజలను చైతన్య పరిచే లాగా మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సభలో ప్రసంగించారు. ఇందులో ఎన్నో విషయాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

అయితే ఇదిలా ఉండగా, ఈ సభలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడడానికి స్టేజ్ మీదకి రాబోతున్నారు. అప్పుడే ఈ సంఘటన జరిగింది. బాలకృష్ణ స్టేజ్ మీదకి వచ్చే ముందు అదే సమయానికి పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణతో పాటు స్టేజ్ మీదకి వచ్చారు. “పవన్ కళ్యాణ్ బాలకృష్ణ స్టేజ్ మీదకి వచ్చే ముందు అలా రావడానికి కారణం ఏంటి?” అని అందరికీ ప్రశ్న నెలకొంది.
Ads

అయితే, పవన్ కళ్యాణ్ ఇలా రావడానికి కారణం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి అని తెలిసింది. అంత పెద్ద వ్యక్తి వస్తుంటే ప్రజలు ఉత్సాహంగా ఆయనకి స్వాగతం పలకాలి అని, అందుకే ముందు వాళ్ళని ఉత్సాహపరచడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి వచ్చారు. వేరే ఉద్దేశంతో కాదు. దాంతో పవన్ కళ్యాణ్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. అంత పెద్ద వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవడం చాలా మంచి విషయం అని అందరూ అంటున్నారు.
ALSO READ : “అనంత్ అంబానీ” కంటే కాబోయే భార్య “రాధిక మర్చంట్” పెద్దవారా..? ఎన్ని సంవత్సరాలు అంటే..?


