“అనంత్ అంబానీ” కంటే కాబోయే భార్య “రాధిక మర్చంట్” పెద్దవారా..? ఎన్ని సంవత్సరాలు అంటే..?

Ads

ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి రాధిక మర్చంట్ తో జరగబోతోంది. వీరి పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో వీరి పెళ్లి జరుగుతుంది. మార్చి 1 నుండి మార్చి 3వ తారీకు వరకు వీరి పెళ్లి వేడుకలు జరుగుతాయి.

ఇందుకోసం భారీగా సెలబ్రిటీలు కూడా తరలి వెళ్తున్నారు. సాధారణంగా అంబానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటేనే బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ అక్కడే ఉంటారు. అలాంటిది అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఇంకా ఎంత మంది ప్రముఖులు వస్తారో మనమే ఆలోచించుకోవాలి.

gifts to ambani daughter in law

హాలీవుడ్ నుండి రిహానా వంటి సింగర్స్ కూడా వస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ కూడా వీరి పెళ్లిలో ఒక లైవ్ సింగింగ్ ప్రోగ్రాం చేస్తారు అని అంటున్నారు. దాదాపు 2500 రకాల వంటకాలని వీరి పెళ్లిలో వడ్డించబోతున్నారు. అంబానీ కుటుంబం కోసం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎంతో మంది డిజైనర్లు ప్రత్యేకంగా దుస్తులు తయారు చేస్తున్నారు. బాలీవుడ్ నుండి ఎంతో మంది ప్రముఖులకి ఆహ్వానాలు అందాయి.

Ads

వారిలో కొంత మంది ఇప్పటికే గుజరాత్ కి బయలుదేరారు. ఇంకా కొంత మంది ఇంకా కొద్ది రోజుల్లో వెళ్తారు. అలాగే బాలీవుడ్ లో టాప్ స్టార్స్ కూడా వీరి పెళ్లిలో పర్ఫార్మ్ చేయబోతున్నారు. గతంలో అంబానీ ఇంట్లో వేడుక జరిగినప్పుడు రణవీర్ సింగ్ వంటి వాళ్లు డాన్స్ చేశారు. ఇప్పుడు కూడా ఇంత ఘనంగా జరుగుతున్న ఈవెంట్ లో టాప్ సెలబ్రిటీలు అందరూ కూడా పాల్గొని, వారిలో కొంత మంది డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇస్తారు. అయితే అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్ కి వయసు తేడా ఉంది. రాధిక అనంత్ కంటే పెద్దవారు. అనంత్ అంబానీ ఏప్రిల్ 10వ తేదీ 1995 లో పుట్టారు.

age difference between anant ambani and radhika merchant

రాధిక మర్చంట్ డిసెంబర్ 18వ తేదీ 1994 లో పుట్టారు. వీరిద్దరికి 5 నెలల వయసు తేడా ఉంది. ఎంతో మంది సెలబ్రిటీలు వయసులో తమకంటే పెద్ద అయిన ఆడవారిని పెళ్లి చేసుకున్నారు. కొంత మంది సంవత్సరాలు తేడా ఉన్న వారిని చేసుకుంటే, విరాట్ కోహ్లీ వంటి వారు ఇలాగే నెలలు తేడా ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నారు. ప్రస్తుతం అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో మంది సినీ రంగానికి, క్రీడా రంగానికి, రాజకీయ రంగానికి, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరు అవుతున్నారు.

ALSO READ : 58 ఏళ్ల హీరోకి జోడిగా 36 ఏళ్ల సమంత..! ఎవరంటే..?

Previous articleడిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?
Next articleనాని సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?