ఈ స్టార్ సింగర్ ఎవరో గుర్తుపట్టారా? ఈ ఎపిసోడ్స్ అన్ని హైలైట్.!

Ads

ఈమె ప్రముఖ నేపథ్య గాయని ప్రముఖ డబ్బింగ్ కళాకారిణి, అందంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు. గుంటూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మడు విజయవాడలో విద్యాభ్యాసం చేసి మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలుగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. గులాబీ, ఎగిరే పావురమా సినిమాలు ఆమెకి మొట్టమొదట బ్రేక్ ఇచ్చిన సినిమాలు.

ఇప్పటివరకు ఆమె 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది, 3000 సినిమా పాటలు పాడింది .ఆమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. మరెవరో కాదండి ఆమె సింగర్ సునీత. అందంలో హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోదు . 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో ఆమెకి వివాహం అయింది. ఈమెకు అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మొదటి భర్తతో విడాకులు అయిన ఈమెకు 2021 జనవరి 9న వ్యాపారవేత్త, మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత అయిన రామ్ వీరపనేనితో రెండవ వివాహం జరిగింది. ఈ వివాహ విషయంలో ఆమె ఎన్నో విమర్శలని ఎదుర్కోవలసి వచ్చింది.అయినా ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన జీవితాన్ని చక్కదిద్దుకుంది. ఇక ఎన్నో నంది అవార్డులను సొంతం చేసుకున్న సునీత ఉత్తమ నేపథ్యగాయనిగా రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులు కూడా తీసుకుంది. రీసెంట్ గా సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా సర్కారు నౌకరి అనే సినిమా లో నటించాడు.

Ads

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఈ సినిమాకి నిర్మాత కావటం విశేషం. ఈ సినిమా అనుకున్నంతగా ప్రజలని రీచ్ కాలేకపోయింది. ఇక సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు రెగ్యులర్గా తన ఫోటోలని షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫోటో సునీత కెరియర్ బిగినింగ్ లోనిది. అప్పట్లో సీనియర్ సింగర్స్, యంగ్ సింగర్స్ కలిసి నిర్వహించినప్పటి ఫోటో ఇది. ఈ కార్యక్రమానికి లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం.

 

Previous article“బాలకృష్ణ” సినిమా టైటిల్ తో వచ్చిన “శ్రీకాంత్” సినిమా ఏంటో తెలుసా? ఒకరికి హిట్..ఒకరికి ఫ్లాప్.!
Next articleప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…కానీ పెళ్లిరోజే భార్యని..! అనుమానంతోనే అఘాయిత్యం!