ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…కానీ పెళ్లిరోజే భార్యని..! అనుమానంతోనే అఘాయిత్యం!

Ads

అనుమానం ఒక మనిషిని ఎంత పతనానికైనా దిగజారుస్తుంది. అనుమానమే ఎన్నో సంసారాలని నాశనం చేస్తుంది. ఆ అనుమానమే ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించి పెళ్లాడిన భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఈనాడు కథనం ప్రకారం…కాకినాడలోని జగన్నాధపురం పప్పుల మిల్లు ప్రాంతంలో నివసిస్తున్న బందుల నూకరాజుకు 2016లో దివ్యతో ప్రేమ వివాహం జరిగింది.

వీరి దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2016 ఫిబ్రవరి 29న ప్రేమ పెళ్లి జరిగింది. నూకరాజు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటాడు ఆ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకి వెళ్లి రెండు మూడు రోజుల తర్వాత వస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు నూకరాజు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగితే కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. మరుసటి రోజు పొద్దున్నే బయటికి వెళ్లి వచ్చిన నూకరాజు మళ్ళీ భార్యతో గొడవ పెట్టుకున్నాడు.

Ads

అయితే రోజు ఉండే గొడవే కదా అని చుట్టుపక్కల ఉన్న బంధువులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో ఇంట్లోంచి బయటకు వచ్చిన దివ్యని వీధిలోనే క-త్తితో విచక్షణ రహితంగా మెడపై నరికి చంపేసాడు నూకరాజు. ఆమెను కాపాడేటందుకు ఆమె తోటి కోడలు తల్లి లక్ష్మి పరుగున వెళ్ళింది కానీ ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు నూకరాజు. ఈ ప్రమాదంలో ఆమె చేతి వేళ్ళకి గాయాలు అయ్యాయి. అడ్డొస్తే నిన్ను కూడా చం-పేస్తాను అని బెదిరించడంతో పక్కకి తప్పుకుంది లక్ష్మి.

హ-త్య జరిగిన అనంతరం నిందితుడు పోలీసులకి లొంగిపోయాడని వార్తలు వినిపించాయి కానీ పోలీసులు ఈ వార్తలని కన్ఫమ్ చేయలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ బాబు వివరించారు. అయితే నూక రాజు తన భార్యని చంపింది ఫిబ్రవరి 29. అంటే వాళ్ళ రెండవ పెళ్లి రోజు నాడే భార్యని కడితేర్చాడు ఈ ప్రబుద్ధుడు.

Previous articleఈ స్టార్ సింగర్ ఎవరో గుర్తుపట్టారా? ఈ ఎపిసోడ్స్ అన్ని హైలైట్.!
Next articleఈ హీరో బర్త్ డే నాలుగేళ్లకు ఒకసారే…ఫిబ్రవరి 29 న పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో ఇతనే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.