“బాలకృష్ణ” సినిమా టైటిల్ తో వచ్చిన “శ్రీకాంత్” సినిమా ఏంటో తెలుసా? ఒకరికి హిట్..ఒకరికి ఫ్లాప్.!

Ads

టాలీవుడ్ లో సినిమాల టైటిల్ రిపీట్ అవ్వడం పరిపాటి. ఒకే టైటిల్ తో సినిమాలు రావడం మనం చూస్తూ ఉంటాము. గతంలో కొందరు హీరోలు నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ లను తిరిగి మళ్లీ ఇప్పుడు సినిమాలకి పెట్టడం జరుగుతుంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమా టైటిల్స్ బాలకృష్ణ కాకుండా చాలమంది హీరోలు వాడుకున్నారు. వీటితో పాటుగా తెలుగులో డబ్ అయి విడుదలయ్యే పరభాష చిత్రాలకు పాత టైటిల్స్ ను వాడడం కామనే.

చిరంజీవి నటించిన ఖైదీ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ టైటిల్స్ దగ్గర నుంచి ఎన్నో టైటిల్స్ డబ్బింగ్ చిత్రాలకు వాడారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ క్రేజీ హిట్ మూవీ టైటిల్ను హీరో శ్రీకాంత్ సినిమాకు వాడారు అన్న విషయం మీకు తెలుసా? బాలకృష్ణ రాధా కాంబినేషన్లో కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో 1988లో విడుదలైన ఒక చిత్రం టైటిల్ శ్రీకాంత్ నటించిన 2003లో విడుదలైన మరొక చిత్రానికి వాడడం జరిగింది.

Ads

ఇంతకీ మూవీ టైటిల్ ఏమిటంటే.. దొంగ రాముడు. రెండు సినిమాల స్టోరీ కాన్సెప్ట్ అన్ని డిఫరెంట్ అయినా కానీ టైటిల్ అలా సెట్ అయిపోయింది. చిత్రంలో అల్లు రామలింగయ్య, శారద ,గోపాలరావు ముఖ్యపాత్రను పోషించారు. శ్రీకాంత్ దొంగ రాముడు చిత్రంలో శ్రీకాంత్ దొంగ పాత్రలో నటించగా లయ జర్నలిస్ట్ వసంత లక్ష్మి గా నటించింది. అయితే బాలకృష్ణ దొంగ రాముడు హిట్ అయినంతగా శ్రీకాంత్ దొంగ రాముడు ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Previous articleతండ్రి వీలునామా రాయకపోతే పెళ్లయిన కూతురికి ఆస్తిలో వాటా ఉండదా.? న్యాయ శాస్త్రం ఏం చెప్తుంది!
Next articleఈ స్టార్ సింగర్ ఎవరో గుర్తుపట్టారా? ఈ ఎపిసోడ్స్ అన్ని హైలైట్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.