Ads
గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. అంబానీ సెలబ్రేషన్స్. ప్రపంచం అంతా కూడా దీని గురించి మాట్లాడుకునే అంత ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ లో తాము స్టార్లు అని చెప్పుకునే ఎంతో మంది సెలెబ్రెటీలు వెళ్లి ఈ వేడుకలో డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో నిర్వహించారు. సాధారణంగా అంబానీ వేడుకలు అంటేనే ఎంతో ఘనంగా జరుగుతాయి. చిన్న సెలబ్రేషన్స్ కూడా పెద్దగా కనిపిస్తాయి.
అలాంటిది పెళ్లి లాంటి పెద్ద వేడుకని ఇంకా ఎంత ఘనంగా నిర్వహిస్తారు అనేది ఇది చూస్తే అర్థం అవుతోంది. అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన రాధిక మర్చంట్ ని ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నారు. గత సంవత్సరం వీరి నిశ్చితార్థం జరిగింది. అది కూడా ఇంతే ఘనంగా జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముందు ఒక మూడు రోజుల సెలబ్రేషన్స్ జరిగాయి. అవి ఇంకా ఘనంగా జరిగాయి.
అయితే, ఇందులో రాధిక మర్చంట్ ధరించిన డ్రెస్ లు కూడా హైలైట్ అయ్యాయి. అందులో రాధిక మర్చంట్ ఒక గోల్డ్ కలర్ లెహంగా ధరించారు. దీన్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ లెహంగా రంగు మాత్రమే గోల్డ్ కాదు. రూపొందించినది కూడా గోల్డ్ తోనే. అవును. మీరు చదివింది నిజమే. ఈ లెహంగానే బంగారపు దారాలతో రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా డిజైనర్ మనీష్ మల్హోత్రా, రాధిక మర్చంట్ ఫొటోస్ షేర్ చేస్తూ పేర్కొన్నారు.
Ads
ఈ లెహంగాని రాధిక మర్చంట్ ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం ధరించారు. ఈ లెహంగా గురించి మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ, “ఇందులో రాధిక వేసుకున్న కోర్సెట్, అంటే పైన కోట్ లాంటి దాన్ని క్రిస్టల్ తో రూపొందించారు. దానికి మెటల్ మెష్ తో ఒక డ్రేప్ ఏర్పాటు చేశారు. దీనికోసం 20వేల స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ని వాడారు. ఈ లెహంగా ని రూపొందించడానికి 70 మంది పని చేశారు” అని రాశారు. ఈ స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ని పెలాడియం, గోల్డ్ ప్లేటెడ్ మెటల్ కలిపి తయారు చేస్తారు. ఇవి గాజు కంటే ఖరీదైనవి. ఎంతో మంది అంతర్జాతీయ సెలబ్రిటీలు వారి దుస్తులని, యాక్సెసరీస్ ని వీటితో డిజైన్ చేయించుకుంటారు.
ఇప్పుడు రాధిక మర్చంట్ లెహంగా కోసం కూడా వీటిని ఉపయోగించారు. అయితే, అంబానీలు ఇలాంటి ఖరీదైన దుస్తులు ధరించడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఈషా అంబానీ పెళ్లి కోసం మొదటి సారిగా వాలంటీనో అని అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ వాళ్లు ఒక లెహంగా రూపొందించారు. దాని ఖరీదు దాదాపు 90 కోట్లు అయ్యింది. ఇటీవల జరిగిన వేడుకల్లో వీళ్ళు వేసుకున్న దుస్తుల ఖరీదు కూడా కోట్లల్లో ఉంటుంది.