గృహిణులు చేసే ఈ ఒకే ఒక్క తప్పు వల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా..? అదేంటంటే..?

Ads

సాధారణంగా చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవారు ఎక్కువ పని చేయరు అని. కానీ ఇంట్లో ఉంటే ఆడవారు అందరికంటే ఎక్కువ పని చేస్తారు. ఇంటి మొత్తం బాధ్యత తీసుకొని, రోజంతా అలసిపోకుండా పనిచేయడం అనేది చిన్న విషయం కాదు.

బయట ఏదైనా పని చేస్తే జీతం ఉంటుంది. కానీ ఇంట్లో అంత పని చేస్తున్నా కూడా ఆడవారికి జీతం ఉండదు. తమ కుటుంబం సంతోషంగా ఉండాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో వారు ఇంటి బాధ్యత మొత్తాన్ని తీసుకుంటారు. తమ గురించి తాము ఆలోచించుకోరు.

ఎన్నో వందల విషయాలు వీళ్లు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు. గృహిణిగా ఉండడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ఉద్యోగం. అలాంటి పని చేస్తున్న వారందరూ కూడా గొప్పవారే. అయితే గృహిణులు చేస్తున్న ఒకే ఒక్క తప్పు వల్ల వారికి తెలియకుండానే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది వాళ్ళు అందరి బాగోగుల కోసం ఆలోచించి చేస్తున్న తప్పు. అదేంటంటే, సాధారణంగా ఒకరోజు ఇంట్లో వంట చేస్తారు.

women prefer to work or to stay in home

Ads

అదే రోజు వండిన పదార్థాలు అన్నీ కూడా అయిపోవాలి అనే నియమం లేదు. కొన్ని సార్లు అవి మిగిలిపోతాయి. వాటిని పడేయడానికి చాలా మంది ఇష్టపడరు. అలా అని బాక్స్ లోకి ఆవే పదార్థాలని కూడా తమ ఇంట్లో వారికి పెట్టలేరు. తినేదే కొంచెం కాబట్టి అప్పటికప్పుడు వండి పెట్టాలి అని అనుకుంటారు. అందుకే అలా మిగిలిపోయినవన్నీ కూడా గృహిణులు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది చాలా ఇళ్లలో జరిగే విషయం. ఇంట్లో ఉండే వారే అలా మిగిలిపోయినవి ఎక్కువగా తింటారు. బయట ఉద్యోగానికి వెళ్లే వారికి మాత్రం అప్పటికప్పుడు తాజాగా వండి ఇస్తారు.

women prefer to work or to stay in home

దాంతో, ముందు రోజు ఆహారం తినడంతో గ్యాస్ ఫామ్ అవ్వడం, నొప్పులు రావడం వంటివి అవుతాయి. అందులోనూ ముఖ్యంగా ఆలుగడ్డ వంటి పదార్థాలు వండినప్పుడు, వాటిని అలాగే పెట్టి మరుసటి రోజు తిన్నప్పుడు మోకాళ్ల నొప్పులు అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయి. వేపుడు పదార్థాలు కూడా ఎక్కువగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇలా ఇంకొకరి కోసం ఆలోచించి గృహిణులు చేసే ఈ ఒక్క తప్పు వల్ల వారికి తెలియకుండానే వారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే గృహిణులు కూడా వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ALSO READ : ఒకే స్టడీ మెటీరియల్ చదివి, ఒకే ఏడాది, ఐఏఎస్ సాధించిన అక్కాచెల్లెళ్ళ సక్సెస్ స్టోరీ..!

Previous articleత్రివిక్రమ్-సునీల్ రియల్ లైఫ్ లో ఇద్దరి మధ్య ఉన్న ఈ కో-ఇన్సిడెన్స్ ఎంత మందికి తెలుసు ?
Next articleసాయి ధరమ్ తేజ్ పక్కనే ఉన్న ఈ హీరో ఎవరో తెలుసా..? ఇతని తండ్రి కూడా చాలా పెద్ద హీరో..!