త్రివిక్రమ్-సునీల్ రియల్ లైఫ్ లో ఇద్దరి మధ్య ఉన్న ఈ కో-ఇన్సిడెన్స్ ఎంత మందికి తెలుసు ?

Ads

సునీల్ అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో హాస్య నటుడిగా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరో కింద కూడా కొన్ని సినిమాలు చేసాడు. మళ్లీ ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద నటిస్తున్నాడు. పుష్ప సినిమాలో కూడా మంచి పాత్ర పోషించాడు సునీల్. అయితే సునీల్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు.

సునీల్ త్రివిక్రమ్ ఇద్దరూ భీమవరానికి చెందిన వాళ్ళు. త్రివిక్రమ్ డైరెక్షన్ గురించి కొత్తగా మనం చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ సినిమాలలో నటించడం కోసం చాలా మంది హీరోలు చూస్తూ ఉంటారు.

Also Read: పెళ్లి కోసమని జిమ్ కి వెళ్లడం మొదలెట్టారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..లేదంటే.?

Ads

అయితే మొదట్లో వీళ్ళిద్దరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకే రూమ్ లో ఉంటూ స్టూడియోలు చుట్టూ వీళ్ళిద్దరూ తిరిగేవారు. సునీల్ అవకాశాలు కోసం చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ”ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి” సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇలా ఆ సినిమాలో నటించాడు సునీల్. త్రివిక్రమ్ కూడా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసి ఫైనల్ గా ఈ స్టేజ్ కి వచ్చారు. అయితే వీళ్లిద్దరి లో కామన్ గా ఒకటి జరిగింది. వీరిద్దరి పెళ్లి ఒకే సంవత్సరం లో ఒకే రోజు అయ్యింది. ఈ విషయం చాలా మందికి తెలీదు.

వీరిద్దరి పెళ్లి ఒకే సంవత్సరం లో ఒకే రోజు అంటే 2002వ సంవత్సరం అక్టోబర్ 11న అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుని కూతురు సాయి సౌజన్య తో సత్య సాయి నిగమంలో త్రివిక్రమ్ పెళ్లి అయ్యింది. ఇక సునీల్ విషయానికి వస్తే.. శృతి ని పెళ్లి చేసుకున్నారు సునీల్. శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. సునీల్ కి ఇద్దరు పిల్లలు వున్నారు. త్రివిక్రమ్ కి కూడా ఇద్దరు పిల్లలు.

Also Read: కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే కదా..? మరి పేర్ల ముందు అక్షరాలు ఎందుకు వేరేగా ఉంటాయి..?

 

Previous articleసినిమా పాటలనే కాదు… సీన్స్ ని కూడా వదలట్లేదుగా..? అసలు సీరియల్ లో ఇలాంటి సీన్ ఎందుకు పెట్టారు..?
Next articleట్విస్ట్ లు అంటే ఇలా ఉండాలి… ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ సినిమా ఇదే! అసలు ఏం ఉంది ఇందులో..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.