సాయి ధరమ్ తేజ్ పక్కనే ఉన్న ఈ హీరో ఎవరో తెలుసా..? ఇతని తండ్రి కూడా చాలా పెద్ద హీరో..!

Ads

వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇటీవల విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సాయి ధరమ్ తేజ్, బ్రో సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించారు. విరూపాక్ష సినిమా సూపర్ హిట్ అవ్వగా, బ్రో సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని పొందలేదు.

బ్రో సినిమా తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటాను అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. చెప్పినట్టుగానే సాయి ధరమ్ తేజ్ తీసుకొని తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్ పనిలో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

hero beside sai dharam tej

ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ సాయి ధరమ్ తేజ్ తప్పు అని చెప్పారు. అవన్నీ కేవలం వార్తలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయితే, సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన పేరులో దుర్గా పేరుని యాడ్ చేసుకుంటున్నట్టు చెప్పారు. తన పేరు సాయి దుర్గా తేజ్ అని చెప్పారు. దుర్గా అనేది సాయి ధరమ్ తేజ్ తల్లి పేరు. అందుకే తన తల్లి పేరుని తన పేరులో కలుపుకుంటున్నట్టు చెప్పారు.

hero beside sai dharam tej

Ads

అంతే కాకుండా, సాయి ధరమ్ తేజ్ ఇవాళ విజయదుర్గ ప్రొడక్షన్స్ పేరుతో తన సొంత బ్యానర్ ప్రకటించారు. ఈ వేడుకలో సాయి ధరమ్ తేజ్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక హీరో. ఆయన పేరు నవీన్ విజయ్ కృష్ణ. నందిని నర్సింగ్ హోమ్, కీర్తి సురేష్ తో కలిసి అయినా ఇష్టం నువ్వు అనే సినిమాల్లో కూడా నటించారు. అసలు కీర్తి సురేష్ మొదటి సినిమా కూడా ఇదే. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.

hero beside sai dharam tej

నవీన్, సాయి ధరమ్ తేజ్ కి చాలా మంచి ఫ్రెండ్. అంతే కాకుండా, నవీన్ తండ్రి కూడా మనందరికీ తెలిసిన చాలా పెద్ద నటులు. ఆయన సీనియర్ యాక్టర్ నరేష్. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి, ఇప్పుడు సహాయ పాత్రల్లో, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించిన సత్య అనే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ పాటకి కూడా దర్శకత్వం వహించారు. అలా ఇప్పుడు దర్శకత్వం వైపు కూడా అడుగు పెట్టారు. ఇవాళ సాయి ధరమ్ తేజ్ తో పాటు విజయదుర్గ ప్రొడక్షన్స్ యొక్క లాంచ్ ఈవెంట్ లో కనిపించారు. ఇందులో దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ALSO READ : సినిమా పాటలనే కాదు… సీన్స్ ని కూడా వదలట్లేదుగా..? అసలు సీరియల్ లో ఇలాంటి సీన్ ఎందుకు పెట్టారు..?

Previous articleగృహిణులు చేసే ఈ ఒకే ఒక్క తప్పు వల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా..? అదేంటంటే..?
Next articleఈమె గురించి తెలుస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే…రతన్ టాటా జీవితంలో చాలా ప్రత్యేకమైన మహిళ.!