Ads
ఒక మనిషి ఆరోగ్య అలవాట్లని బట్టి వారి మనసు, మెదడు కూడా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్య అలవాట్లు, అందులోనూ ఆహార అలవాట్లు అనేవి సరిగ్గా ఉండటం ముఖ్యమైన విషయం. అందుకే చాలా మంది ఈ మధ్య జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకుంటున్నారు.
కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. డైట్ పాటిస్తున్నారు. దీని వల్ల మెదడు మీద కూడా ఎంతో ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా ఒత్తిళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. విరామం తీసుకోవడానికి సమయం లేకుండా పని చేయాల్సి వస్తుంది.
కాబట్టి అలాంటప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి డైట్ పాటించడం అనేది చాలా ముఖ్యం. అలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఆరోగ్యాలవాట్లని పాటిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. జగన్ కి మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే కచ్చితంగా భోజనంలో మామిడికాయ పులిహోర తినేవారు. పోషకాహారం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారు.
జగన్ చదువుకునేటప్పుడు, ఆ తర్వాత వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నా కూడా, సీమ ఆహారం అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. ఉదయం 4:30 జగన్ దినచర్య మొదలవుతుంది. అప్పుడు యోగా, లేదా జిమ్ చేశాక, ఐదున్నరకి న్యూస్ పేపర్ చదివి, కొన్ని ముఖ్యమైన అంశాల మీద నోట్స్ సిద్ధం చేసుకుంటారు. అలాంటి సమయంలో టీ తాగుతారు. 7 గంటల సమయంలో జ్యూస్ తాగుతారు. అయితే, చాలా మంది ఉదయం టిఫిన్ చేస్తారు. కానీ జగన్ ఉదయం టిఫిన్ చేయకుండా కొన్ని, డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు.
Ads
పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్ టిఫిన్ కి దూరంగా ఉన్నారు. మధ్యలో చాక్లెట్ బైట్స్ వంటివి తింటారు. లంచ్ సమయంలో మాత్రం పుల్కా తింటారు. అప్పుడప్పుడు లంచ్ లో రాగి ముద్ద, మటన్ కీమాని తీసుకుంటారు. చాలా మందికి చివరిలో పెరుగు తినకుండా లంచ్ పూర్తయినట్టు అనిపించదు. జగన్ కూడా అంతే. లంచ్ చివరిలో కుండ పెరుగు కచ్చితంగా తీసుకుంటారు. అలా తినకపోతే లంచ్ పూర్తయినట్టు అనిపించదు అనే విషయాన్ని ఆయన సన్నిహితులు చెప్పారు.
రాయలసీమ స్పెషల్ చిత్రాన్నం అంటే కూడా జగన్ కి చాలా ఇష్టం. సాయంత్రం టీ తాగుతారు. జగన్ కి పల్లీలు, మొక్కజొన్న పొత్తులు ఇష్టం. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఇవి తింటారు. కానీ జగన్ ఎక్కువగా పండ్ల రసాలు తాగడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీకెండ్ వస్తే మాత్రం బిర్యాని, చేపల పులుసు, మటన్ వంటివి తింటారు. ఇవన్నీ తిన్నా కూడా మితంగానే జగన్ ఆహారాన్ని తీసుకుంటారు. అంతే కాకుండా వ్యాయామం చేయడంతో ఒత్తిడిని తన దరిదాపుల్లో ఉండకుండా చూసుకుంటారు.
ALSO READ : ఒకే స్టడీ మెటీరియల్ చదివి, ఒకే ఏడాది, ఐఏఎస్ సాధించిన అక్కాచెల్లెళ్ళ సక్సెస్ స్టోరీ..!