Indrani Mukerjea Netflix: ఒకే ఒక్క సంఘటన… దేశం మొత్తాన్ని భయపెట్టింది..! అసలు ఎవరు ఈ మహిళ..?

Ads

ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే కాదు డాక్యుమెంటరీస్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. నిజ జీవితంలో జరిగిన చాలా సంఘటనల ఆధారంగా ఈ డాక్యుమెంటరీలని రూపొందిస్తున్నారు. ఇవి సినిమాలాగానే ఉంటాయి. కాకపోతే నిజజీవితంలో ఉండే మనుషులు ఇందులో కూడా కనిపిస్తారు.

అసలు నిజానికి ఏం జరిగింది అనే విషయాలని డాక్యుమెంటరీలో కూర్చొని చెప్తారు. అలా ఇప్పుడు మరొక డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అది కూడా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సంఘటన జరిగినప్పుడు భారతదేశం అంతా కూడా షాక్ కి గురయ్యింది.

netflix documentary based on real life incident

చాలా సంవత్సరాలు దీని గురించి మాట్లాడుకున్నారు. ఆ వ్యక్తి గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీ. ఈమె పేరు మీద నెట్​ఫ్లిక్స్ వాళ్లు ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్​ ట్రూత్ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. మొదట ఈ డాక్యుమెంటరీని విడుదల చేయడానికి స్టే విధిస్తూ సీబీఐ ఒక పిటిషన్ వేసింది. కానీ ముంబై హైకోర్టు మాత్రం ఆ పిటిషన్ ని కొట్టివేయడం కారణంగా ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలు దాటింది.

netflix documentary based on real life incident

2012 లో ఈ సంఘటన ముంబైలో జరిగింది. షీనా బోరా అనే ఒక 25 సంవత్సరాల యువతి, ముంబైలోని మెట్రో వన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉండేది. అదే సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీన ఆమె కనిపించలేదు. తర్వాత ఆమె చనిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ విషయం మీద చాలా కాలం దర్యాప్తు చేశారు. దాంతో 2015 లో షీనా బోరా తల్లి, మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో చాలా చీకటి రహస్యాలు బయటికి వచ్చాయి.

netflix documentary based on real life incident

ఇంద్రాణి ముఖర్జీకి మొత్తం 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె మొదటి భర్తకి పుట్టిన కూతురు షీనా బోరా. మైఖేల్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత అతనితో విడిపోయాక, తన పిల్లలు ఇద్దరినీ కూడా గౌహతిలో నివసిస్తున్న తన తల్లిదండ్రుల వద్ద ఇంద్రాణి ఉంచింది. అప్పుడు సంజీవ్ ఖన్నా అనే ఒక వ్యక్తితో ఇంద్రాణి పెళ్లి జరిగింది. తర్వాత అతనితో విడిపోయాక, మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జీయాని ఇంద్రాణి పెళ్లి చేసుకుంది.

netflix documentary based on real life incident

Ads

అయితే, అప్పుడు షీనా చనిపోవడంతో రెండవ భర్త సంజీవ్ ఖన్నా, వారి డ్రైవర్ అయిన శ్యామ్​వర్​ రాయ్ మీరు కూడా అనుమానం ఉండడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. వీరిలో శ్యామ్​వర్​ రాయ్ చట్ట విరుద్ధంగా ఆయుధాలు తరలించే కేసులో పడ్డాడు. దాంతో అప్పటికే అతను అరెస్ట్ అయ్యాడు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఎన్నో రహస్యాలు బయటికి వచ్చాయి. ఇంద్రాణి తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టింది. షీనాని తన చెల్లెలుగా పరిచయం చేసింది.

netflix documentary based on real life incident

అప్పటికే షీనా యుక్త వయసులో ఉంది. పీటర్ భార్య మొదటి కుమారుడు రాహుల్. షీనా అతనితో సన్నిహితంగా ఉండేది. ఈ విషయం ఇంద్రాణికి నచ్చలేదు. దాంతో షీనాకి, ఇంద్రాణికి గొడవలు అవ్వడం మొదలు అయ్యాయి. అప్పుడు షీనా, విషయం మొత్తాన్ని పీటర్ కి చెప్తాను అని ఇంద్రాణిని బెదిరించింది. దాంతో విసిగిపోయిన ఇంద్రాణి, రెండవ భర్త సంజీవ్ ఖన్నా సహాయంతో, షీనాని కారులో హత్య చేశారు. అందుకోసం వారి డ్రైవర్ సహాయం తీసుకున్నారు. అసలు ముందు ఇంట్లోనే హత్య చేయాలి అని సంజీవ్ అనుకున్నాడు. కానీ ఇంట్లో పీటర్, రాహుల్ ఉండడంతో ఇంద్రాణి దీనికి ఒప్పుకోలేదు.

netflix documentary based on real life incident

అంతే కాకుండా, ఈ విషయం అంతటిలో కూడా రాహుల్ పేరు రావడం ఇంద్రాణికి ఇష్టం లేదు. ఈ కారణంగానే కారులో ఆమె హత్యకి ప్లాన్ చేశారు. బాంద్రాలోని ఒక వీధిలో ఆమెని చంపేశాక, వోర్లిలోని ఇంద్రాణి ఇంటికి ఒక బ్యాగ్​లో మృతదేహాన్ని పెట్టి తీసుకెళ్లారు. అక్కడి నుండి గగోడే అనే గ్రామానికి వెళ్లి, శవాన్ని అక్కడ పడేశారు. అయితే, దర్యాప్తు చేసిన తర్వాత సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్​వర్​ రాయ్ అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇంద్రాణి మాత్రం తన కూతురు ఇంకా బతికే ఉంది అని, అమెరికాలో ఉంటుంది అని చెప్పింది.

netflix documentary based on real life incident

2021 నవంబర్ లో బెయిల్ పిటిషన్ ని బాంబే హైకోర్టు కొట్టివేసినా కూడా, 2002 మేలో ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ మీద కూడా ముందు విడుదల కాకూడదు అంటూ ఎన్నో చర్చలు జరిగాయి. కానీ ఈ వ్యవహారం మీద స్టే విధించలేము అని సీబీఐ అందించిన పిటిషన్ ని ముంబై హైకోర్టు కొట్టివేయడంతో, ఫిబ్రవరి 29 నుండి ఈ డాక్యుమెంటరీ విడుదల అయ్యింది.

ALSO READ : రెమ్యూనరేషన్ విషయంలో “కిరణ్ అబ్బవరం” కొత్త రూట్ గురించి తెలుసా..? ఇలా ఏ హీరో చేయరు ఏమో..!

Previous articleచిరంజీవి కూతురు సుస్మిత భర్త బ్యాగ్రౌండ్ మీకు తెలుసా..?
Next articleఆంధ్రప్రదేశ్ సీఎం “వైయస్ జగన్మోహన్ రెడ్డి” ఆహార నియమాలు ఎలా ఉంటాయో తెలుసా..? రోజు ఉదయం ఎన్ని గంటలకి లేస్తారంటే..?